-బాధితులకు నిత్యావసర సరుకులు!!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ముఖ పుస్తకం, వాట్సప్ వంటి, సామాజిక మాధ్యమాల వేదికగా, గత రెండున్నర సంవత్సరాలుగా, తెలుగు రాష్ట్రాలలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న, స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్, పలువురి ఆర్థిక సహకారంతో, ఆదివారం, విజయవాడ లోని సితార సెంటర్, బుడమేరు వంతెన, సింగ్ నగర్, బాంబే కాలనీ, రాణి గారి తోట ప్రాంతాలలో, ఎక్కువ నష్టపోయిన 125 వరద బాధిత కుటుంబాలకు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మస్కిటో కాయిల్స్, డెటాల్ సబ్బులు, డిటర్జెంట్ సబ్బులు, రెండు రకాల పచ్చళ్ళ ప్యాకెట్లు, టీ పొడి ప్యాకెట్లు, కొబ్బరినూనె, షాంపూ షాచెట్ లు, టూత్ బ్రష్ లు, టూత్ పేస్టులు, చిన్నపిల్లలకు స్నాక్స్ పాకెట్లు, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, గోధుమపిండి, ఉప్పు, పసుపు, కారం, తాలింపు గింజలు, మరమరాలు వంటి 19 రకాల వస్తువులతో కూడిన కిట్ బ్యాగ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, ట్రస్ట్ చైర్మన్, డాక్టర్ పులి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ, వరద బాధితులకు సాయం అందించేందుకు ఏర్పాటుచేసిన నిధికి, ముఖ పుస్తక మిత్రులు, లయన్స్ క్లబ్ సభ్యులు, తమ మిత్రులు దాదాపు 72 మంది, 85,249 రూపాయలు విరాళంగా అందజేయగా, ఈ మొత్తంలో, అత్యధిక విరాళాన్ని, గుంటూరుకు చెందిన లెక్చరర్, శ్రీమతి కొత్తపల్లి నాగజ్యోతి, 11వేల రూపాయలు, జగ్గయ్యపేటకు చెందిన, జేకే వెల్నెస్ సెంటర్ వారు, 6 వేల రూపాయలు ఇచ్చారని చెప్పారు. ఈ పంపిణీ కార్యక్రమంలో, కొత్తపల్లి నాగ జ్యోతి, రూప్ నాథ్, ఎం ఈవెంట్స్ పూర్ణ, ప్రవీణ్, మీరావలి, రాజేష్, పండు, రాధాకృష్ణ, రామకృష్ణ, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.