Breaking News

కె ఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదల చేసిన ముఖ్యమంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కె ఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష -2025 పోస్టర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, విద్యా విధానం, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే రాయితీలు, స్కాలర్షిప్ విధానం గురించి యూనివర్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల సాధించిన ప్రగతి, క్యాంపస్ ప్లేసెమెంట్స్ అంశాలపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ప్రో ఛాన్సులర్, డాక్టర్ జగన్నాధరావు, వైస్ ఛాన్సులర్ డాక్టర్ సారధివర్మ, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్బంగా డాక్టర్ సారధివర్మ మాట్లాడుతూ యూనివర్సిటీ అందించే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై మూడు విడతలుగా దేశ వ్యాప్తంగా ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మొదటి విడత ప్రవేశ పరీక్షను డిసెంబర్ 6 వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే అన్ని రకాల ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు ధీటుగా కె ఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *