విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
భారతదేశపు నెం.1 బజాజ్ డీలర్ వరుణ్ బజాజ్ వారి విజయవాడ శాఖ తమ 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. దానితో పాటు బజాజ్ ఆటో వారు ప్రవేశపెట్టిన గేమ్ ఛేంజర్ బైక్, ప్రపంచపు మొట్టమొదటి సిఎన్‌జి బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125ను శనివారం లారీ ఓనర్స్ అసోషియేషన్ హాల్, బెంజ్ సర్కిల్, విజయవాడ వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, బజాజ్ ఆటో రీజనల్ మేనేజర్ సేల్స్ సి.ఎస్.కరుణాకరన్ మరియు బజాజ్ ఆటో రీజనల్ మేనేజర్ సర్వీస్ సచిన్ జైన్‌లు, సరికొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సిఎన్ని బైకును ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటి వరకు 3.75 లక్షల 283 వీలర్ల అమ్మకాలు జరిగాయని మరియు సర్వీసులో 20.5 లక్షల కస్టమర్లకు సేవలు అందించామని సంతోషంగా తెలియజేసారు. సరికొత్త బజాజ్ ఫ్రీడమ్ బైక్ ట్విన్ ట్యాంక్ సెటప్‌ని కలిగి ఉంటుంది. ఒక ట్యాంక్ పెట్రోల్ కొరకు, మరో ట్యాంక్ సిఎన్ కొరకు ప్రత్యేకంగా డిజైన్ చేసారు. ఇందులో రెండు రకాల ఫ్యూయల్స్‌ని వాడుకోవచ్చు. ఫ్యూయల్ ఆప్షన్ని ఎంచుకోవడానికి ప్రత్యేకంగా రెండు స్విచ్లను ఏర్పాటు చేసారు. బజాజ్ ఫ్రీడమ్ బైక్ మూడు రకాల వేరియంట్లలో లభ్యమవుతుంది. డ్రమ్, డ్రమ్ ఎస్‌ఇడి, డిస్క్ ఎల్‌ఇడి అను 3 వేరియంట్లు ఉన్నాయి. ఇందులో మొదటిది ఎంట్రీ లెవెల్ వేరియంట్ బజాజ్ ఫ్రీడమ్ 125 డ్రమ్ ఎక్స్ షోరూం ధర రూ.95,000 కాగా, రెండవది మిడ్ రేంజ్ వేరియంట్ డ్రమ్ ఎల్‌ఇడి ఎక్స్ షోరూం ధర రూ.1.05 లక్షలు కాగా మరియు మూడవది టాప్ ఎండ్ వేరియంట్ డిస్క్ ఎల్‌అడి ఎక్స్ షోరూం ధర రూ.1.10 లక్షలుగా ఉందని తెలియజేసారు. ఫ్రీడమ్ 125 బైక్ కి అమర్చిన 125 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ పెట్రోల్ Ê సిఎన్ రెండిరటితోనూ రన్ అవుతుంది. 9.5 పిఎస్ పవర్. 9.7 ఎన్‌ఎం టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ట్యాంక్ సామర్ధ్యం 2 లీటర్లు కాగా, సిఎన్ని ట్యాంక్‌లో 2 కిలోల గ్యాస్ పడుతుంది. ఇంతేకాక టెలీస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ లింక్-మోనోషాక్ సిస్టమ్, ఫ్రంట్ సైడ్ 17 ఇంచీల అల్లాయ్ వీల్, బ్యాక్ సైడ్ 16 ఇంచీల అల్లాయ్ వీల్, రెండూ ట్యూబ్స్ టైర్లు. ముందు వైపు 240 ఎం.ఎం. డిస్క్ బ్రేక్, వెనుక వైపు 130 ఎం.ఎం. డ్రమ్ బ్రేక్ ఉన్నాయన్నారు. వార్షికోత్సవ మరియు దసరా ఆఫర్లుగా ప్రతి బజాజ్ బైక్ కొనుగోలుపై క్యాబిన్ ట్రాలీ సూటే కేసును ఉచితంగాను, రూ.5000 వరకు క్యాష్ ఆఫర్‌ను అందిస్తున్నారు. పాత 2 వీలర్‌కు ఎక్స్‌ఛేంజ్‌లో రూ. 2000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ ను అందిస్తున్నారు. అంతేకాక అతి తక్కువ డౌన్‌పేమెంట్, అతి తక్కువ వడ్డీరేటు, స్పాట్ ఎక్స్‌ఛేంజ్, స్పాట్ ఫైనాన్స్, స్పాట్ అప్రూవల్ వంటి సదుపాయాలను కూడా కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బజాజ్ ఆటో ఏరియా సేల్స్ మేనేజర్ సాదత్ భాషా, ఎఎస్‌ఎం అశోక్ రెడ్డి, వరుణ్ బజాజ్ జిఎం పద్మజ, వరుణ్ సిబ్బంది మరియు కస్టమర్లు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …