మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి మంత్రివర్యులు నగరంలోని వారి నివాసంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ నియోజకవర్గ మచిలీపట్నం నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా కొత్త సబ్ స్టేషన్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. విద్యుత్ తీగలు కిందకు పూగులాడటం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాటి నివారణకు తీగలు సరిచేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు మచిలీపట్నం వైద్య కళాశాలలో విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఆ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రుద్రవరం గృహ నిర్మాణ కాలనీలో గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించి అక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు
పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునేలా ప్రజలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. కరపత్రాలు ముద్రించి ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. అవసరమైతే బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిడిసిఎల్ ఎస్ ఈ సత్యానందం, ఈఈ లు శ్రీనివాసరావు, బి వి సుధాకర్,డిఈలు, ఏ ఈ లు పాల్గొన్నారు.