విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్దుబాటు చార్జీల పేరుతో పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని లాంతర్ పట్టుకొని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ సర్కిల్ వరకు లాంతర్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ పెరిగిన చార్జీలతో ప్రజలు ఇక అంధకారంలో బ్రతకాలన్నారు. లాంతర్లు కొనుక్కోవాలన్నారు. వైసిపి హయంలో 35 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని అమలు చేస్తుంది. ఇప్పటికే 17 వేల కోట్లు భారాన్ని మోపారు. వైసిపికి కూటమికి తేడా ఏమీ లేదన్నారు. ఇదెక్కడి న్యాయం అన్నారు. ఇప్పటికే ఏపిలో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో 4.80 పైసలు యూనిట్ ధర ఉంటే… ఆంధ్రలో యూనిట్‌కి 6 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు సర్దుబాటు చార్జీలు పేరుతో 40 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రజలు మీకు ఓట్లు వేసింది వైసిపి మీద వ్యతిరేకత తోనే, ఇపుడు మీరు భారాన్ని మోపడం అన్యాయం. వైసిపి తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. విచారణ జరపండన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు షర్మిలా రెడ్డితో పాటు ఎఐసిసి జాయింట్ సెక్రటరీ పలక్‌వర్మ, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఉమ్మడి కృష్ణాజిల్లా కాపు సెల్ నాయకుడు అల్లం రాజేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …