Breaking News

All News

నగరిలో మంత్రి ఆర్కే రోజా నామినేషన్ దాఖలు…

నగరి, నేటి పత్రిక ప్రజావార్త : నగరిలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు నగరిలోని పుదుపేట వినాయక స్వామి ఆలయంలో ఆర్కే రోజా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నగరి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ప్రదర్శనగా వచ్చారు. నగరి క్లాక్ టవర్ వద్ద మంత్రి రోజాకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

Read More »

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాల‌కు కౌన్సెలింగ్

– కృష్ణా, ఎన్‌టీఆర్ జిల్లాల స‌మ‌న్వ‌య అధికారి బి.సుమిత్రా దేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మిగిలిన సీట్లకు ఈ నెల 22, 23 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కృష్ణా, ఎన్‌టీఆర్ జిల్లాల స‌మ‌న్వ‌య అధికారి బి.సుమిత్రా దేవి శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో 2024-25 విద్యా సంవ‌త్స‌రంలో 5వ త‌ర‌గ‌తిలో చేరేందుకు కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప‌రీక్ష‌లో మెరిట్ ప్ర‌కారం ఇప్ప‌టికే మొద‌టి జాబితాలో సీట్లు కేటాయించ‌గా మిగిలిన …

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న నేటి గాంధీ…

చైన్నె, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును ప్రతి ఓటరూ వినియోగించుకోవాలని గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌ (నేటి గాంధీ) పిలుపునిచ్చారు. శుక్రవారం చైన్నెలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్‌ మాట్లాడుతూ తాను పుట్టింది ఆంధ్రా అయితే… పెరిగింది తమిళనాడు అని అన్నారు. అందుకే ఇప్పటికీ ఎక్కడవున్నా కూడా ఓటువేసే సమయంలో తమిళనాడులోనే గుర్తుగా ఓటు వేస్తున్నానన్నారు. ఎన్నికలలో దేశంలో మత సామరస్యాన్ని కాపాడే వారినే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం అవసరమన్నారు. …

Read More »

బాలల న్యాయ చట్టం పరిధిలో బాలల హక్కుల కమిషన్ పనిచేస్తుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో బాలల న్యాయ చట్టం పరిధిలో మాత్రమే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ పనిచేస్తుంది అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మరియు సభ్యులు జంగం రాజేంద్ర ప్రసాద్,గోండు సీతారాం,బత్తుల పద్మావతి,త్రివర్ణ ఆదిలక్ష్మి తెలిపారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద బహిరంగ సభ లో కొంత మంది దుండగులు రాళ్ళు తో దాడిచేసి గాయపర్చిన సంఘటన నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు బాలల …

Read More »

నామినేషన్ దాఖలు చేసిన బోండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఈరోజు ఏకాదశి సందర్భంగా మంచిరోజు అని నామినేషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొన్నారు.

Read More »

ఓటు వేసే వ్య‌క్తి.. ప్ర‌జాస్వామిక శ‌క్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కులు వి.జ‌స్టిన్‌; విజ‌య‌వాడ ప‌శ్చిమ‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్, తిరువూరు, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కులు సౌర‌భ్ శ‌ర్మ; విజ‌య‌వాడ తూర్పు, నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గాల ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కులు మ‌ద‌న్ కుమార్ త‌దిత‌రుల‌తో క‌లిసి ఓట‌ర్ల‌ను జాగృతం చేసే పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో ఓటు …

Read More »

వివ‌క్ష ర‌హితంగా వ్య‌య ప‌ర్య‌వేక్ష‌ణ‌

– క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి – నివేదిక‌ల నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ స‌మ‌ర్థ‌వంతంగా ఉండాలి – జిల్లా ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కులు వి.జ‌స్టిన్‌, సౌర‌భ్ శ‌ర్మ‌, మ‌ద‌న్ కుమార్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలో ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు, ఆశ‌యాలు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా వివ‌క్ష ర‌హితంగా ఎన్నిక‌ల వ్య‌య ప‌ర్య‌వేక్ష‌ణ జ‌రిగేలా అధికారులు కృషిచేయాల‌ని జిల్లా ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కులు వి.జ‌స్టిన్‌, సౌర‌భ్ శ‌ర్మ‌, మ‌ద‌న్ కుమార్ అన్నారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో …

Read More »

ఎటువంటి లోటు పాట్లు లేకుండా యూపీఎస్సి పరీక్షలను పక్కాగా నిర్వహించాలి

-అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా యేర్పాట్లు చేయండి -జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21 ఆదివారం నిర్వహించ నున్న యూపీఎస్సి పరీక్షలను లోటు పాట్లు లేకుండా పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సి ) ద్వారా నిర్వహించే పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్లో వెన్యూ సూపర్వైజర్లు, లైజన్ కం ఇన్స్పెక్టింగ్ అధికారులతో కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులతో సమావేశంనిర్వహించారు. ఈ …

Read More »

జిల్లాలో రెండో రోజు మొత్తం 18 మంది అభ్యర్థులు నామినేష‌న్లు దాఖ‌లు

– విజ‌య‌వాడ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి మూడు నామినేష‌న్లు – ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు 15 నామినేష‌న్లు దాఖ‌లు – జిల్లా ఎన్నిక‌ల అధికారి ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నామినేష‌న్ల దాఖ‌లు ప్ర‌క్రియ‌లో భాగంగా జిల్లాలో రెండో రోజున‌ మొత్తం 18 మంది అభ్యర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేశారని.. ఇందులో విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి మూడు నామినేష‌న్లు, ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి 15 నామినేష‌న్లు దాఖ‌లైన‌ట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి ఎస్‌.డిల్లీరావు శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. మే …

Read More »

రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పార్లమెంటు అభ్యర్థిగా పేరం శివనాగేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (అథవాలే) పార్టీ తరపున పేరం శివనాగేశ్వరరావు గౌడ్‌ విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థిగా శుక్రవారం విజయవాడ నందు గల ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ నందు కలెక్టర్‌కి నామినేషన్‌ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేదలకు అండగా ఉంటానని, ప్రజలు నన్ను ఆశీర్వదించి పార్లమెంట్‌ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. దీనికి గానూ కృష్ణానది జలాలు వృధా కాకుండా చెక్‌ …

Read More »