Breaking News

రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పార్లమెంటు అభ్యర్థిగా పేరం శివనాగేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (అథవాలే) పార్టీ తరపున పేరం శివనాగేశ్వరరావు గౌడ్‌ విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థిగా శుక్రవారం విజయవాడ నందు గల ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ నందు కలెక్టర్‌కి నామినేషన్‌ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేదలకు అండగా ఉంటానని, ప్రజలు నన్ను ఆశీర్వదించి పార్లమెంట్‌ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. దీనికి గానూ కృష్ణానది జలాలు వృధా కాకుండా చెక్‌ డాములు నిర్మించి నీరు నిలవచేసి తద్వారా రైతులకు సాగునీరు అందించడం వలన అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని దీని మీద లోక్‌సభలో తీర్మానం తీసుకొచ్చేలాగా చేయగలనని పేద ప్రజలకు వాగ్దానం చేస్తూ ప్రజలకు నిరంతరం అండగా ఉంటానన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటానని 18 సంవత్సరాల నిండిన ప్రతి ఓటరు తన ఓటు హక్కును ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బతికించాలన్నారు. ప్రతి ఒక్కరు ఓటు ద్వారా ప్రజా సంక్షేమాన్ని అందించే ప్రజా పాలకుల్ని ఎన్నుకోవాలని తద్వారా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *