Breaking News

Andhra Pradesh

మూడో వేవ్ ప్రచారం నేపథ్యంలో కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు-మాస్కు ధరిద్ధాం వైరస్ ను ఎదుర్కొందాం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతూ వస్తోంది. మే 15 నుంచి జూన్‌ 20 వరకు దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా ఆంక్షలు సడలిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. అయితే కేసుల సంఖ్య మన రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నా… దేశంలోని కేరళ, మహారాష్ట్రసహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో మూడో వేవ్ …

Read More »

అల్ప సంఖ్యాక వర్గాలకు పూర్తిస్థాయిలో లబ్దిచేకూర్చాలి…

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం, అభివృద్దికై ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను మరింత పటిష్టంగా అమలుపరుస్తూ ఆయా వర్గాలకు పూర్తిస్థాయిలో లబ్దిచేకూర్చాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం మూడో బ్లాక్ లోని తన ఛాంబరునందు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ …

Read More »

మాస్క్ ధరించకుండా వాహనాలు నడపవద్దు : ఆర్టీఓ యం పద్మావతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోన కారణంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, అది ప్రతిఒక్కరి బాధ్యతగా గుర్తించుకోవాలని ఆర్టీఓ యం పద్మావతి పేర్కొన్నారు. నందిగామలోని పాత బైపాస్ రోడ్డు దగ్గర మంగళవారం నాడు డిటీసీ యం పురేంద్ర ఆదేశాల మేరకు మాస్క్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న, ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కోవిడ్ పై అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ యం పద్మావతి మాట్లాడుతూ కోవిడ్ ను నియంత్రించాలంటే మాస్కును ధరించడం భౌతిక దూరం పాటించడం వంటివి కీలక అంశాలని అన్నారు. …

Read More »

నో మాస్క్ నో రైడ్ సహకరించండి…

-మాస్క్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న ఆటో డ్రైవర్లకు, ప్రయాణికులకు కౌన్సిలింగ్ -ఆర్టీఓ కె రామ్ ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోన పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, మన కొద్దిపాటి నిర్లక్ష్యం తిరిగి కరోన వ్యాప్తికి కారణం కాకూడదని ఆర్టీఓ కె రామ్ ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మాస్క్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారికి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా స్థానిక బందర్ రోడ్డు లోని ఆర్&బి కార్యాలయం ముందు ఆర్టీఏ …

Read More »

డిజిపి గౌతం సవాంగ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మహిళా పోలీసులు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పోలిస్ ప్రధాన కార్యాలయం లో డిజిపి గౌతం సవాంగ్ ఐపీఎస్ ను మహిళా పోలీసులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.  ఆంధ్ర ప్రదేశ్ లో మహిళల భద్రత , రక్షణకు పెద్దపీట  వేస్తూ అనుక్షణం వారికి తోడు నీడగా అన్నివేళలా అందుబాటులో ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్. జగన్ మోహన్ రెడ్డి  గ్రామ, వార్డు సచివాలయల్లోని 15000 మంది  మహిళ సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తిస్తూ  జీవో నెంబర్ 59ని జారీ చేయడం పట్ల హర్షం …

Read More »

గ్రామాల్లో కోవిడ్ నియంత్రణపై నోమాస్క్– నో ఎంట్రి , నోమాస్క్ – నో రైడ్, నోమాస్క్ -నో సేల్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలి..

-యంపీడీవో వెంకట రమణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాల్లో భాగంగా “పెద లందరికి ఇళ్ళు” కార్యక్రమము లో ఎంపిక చేయబడిన లబ్ధిదారులను జియో టాగింగ్ ప్రక్రియను పూర్తి చేసి త్వరిత గతిన ఆన్ లైన్ లో పొందు పర్చాలని యంపీడీవో ఏ వెంకటరమణ సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. స్థానిక యంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం గుడివాడ రూరల్ మండలానికి సంబందించి సచివాలయ సెక్రటరీలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లుతో హౌసింగ్, కరోనా నియంత్రణ అంశాల పై సమీక్షించారు. ఈ సందర్బం …

Read More »

వార్డు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ, ప్రభుత్వ పథకాల వివరాల బోర్డులను ప్రదర్శించాలి…

-సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలి.. -కోవిడ్ కట్టడికి “నో మాస్క్ నో ఎంట్రీ , “నో మాస్క్ – నో రైడ్”, “నో మాస్క్ – నో సేల్ ” నినాదాలతో ప్రత్యేక అవగాహన కల్పించాలి… -మున్సిపల్ కమీషనర్ పీజే సంపత్ కుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్నసేవలకు సంబందించి ఏ ఒక్క అంశం పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని, విధులు పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బంది చర్యలు …

Read More »

డివిజన్ పరిధిలో “నో మాస్క్ నో ఎంట్రీ”, “నో మాస్క్ – నో రైడ్”, “నో మాస్క్ – నో సేల్ ” నినాదాలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టాం.

-రైతులు మంచి మనస్సుతో ముందుకొచ్చి ఎంఐజీ స్కీముకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 40 లక్షలకు భూములను అందించి సహకరించాలి… -గ్రామ, వార్డు సచివాలయాల్లో సచివాలయం ద్వారా అందించే సేవలు, ప్రభుత్వం పథకాలు, అర్హతలు, లబ్దిదారుల వివరాలు తెలిపే బోర్డులు ప్రదర్శించాలి… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిఫుణులు హెచ్చరిస్తున్నందున ప్రజలందరూ కరోనా వైరస్ నియంత్రణ పట్ల అప్రమత్తతో అవగాహన కలిగి ఉండాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఆర్డీవో …

Read More »

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సమాచార శాఖ… : మంత్రి పేర్ని నాని

–నూతనంగా అసిస్టెంట్ డైరెక్టరుగా పదవి బాధ్యతలు చేపట్టిన యం. భాస్కరనారాయణ మంగళవారం జిల్లా కలెక్టరును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయుటలో ప్రధాన భూమిక సమాచార శాఖ పోషించాలని రాష్ట్ర రవాణా సమాచార శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. కృష్ణాజిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై రాష్ట్ర సమాచార కేంద్రంలో అసిస్టెంట్ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన యం. …

Read More »

ఇళ్ల నిర్మాణ లేఅవుట్ల అభివృద్ధి అప్రోచ్ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయండి…

-స్పందనలో అందిన విజ్ఞప్తులను గడువులోగా పరిష్కరించండి… -కోవిడ్ కట్టడికి నో మాస్క్ – నో ఎంట్రీ”, “నో మాస్క్ – నో రైడ్”, “నో మాస్క్ – నో సెల్ ” నినాదాలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు… -సబ్ కలెక్టర్ బి, సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివిజన్ లో గృహనిర్మాణ శాఖచే ప్రతిపాదించిన ఇళ్ల నిర్మాణ అన్ని లేఅవుట్ల అభివృద్ది అప్రోచ్ రోడ్లతో సహా వారం రోజులోగా పూర్తి చేయాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. …

Read More »