–నూతనంగా అసిస్టెంట్ డైరెక్టరుగా పదవి బాధ్యతలు చేపట్టిన యం. భాస్కరనారాయణ మంగళవారం జిల్లా కలెక్టరును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయుటలో ప్రధాన భూమిక సమాచార శాఖ పోషించాలని రాష్ట్ర రవాణా సమాచార శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. కృష్ణాజిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై రాష్ట్ర సమాచార కేంద్రంలో అసిస్టెంట్ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన యం. భాస్కర నారాయణ విజయవాడ ఆర్ అండ్ బి అతిథిగృహంలో మంగళవారం రాష్ట్ర సమాచార శాఖామంత్రి పేర్ని నానిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈసందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నదని మంత్రి అన్నారు. గత రెండు సంవత్సరాలు కాలంగా వివిధ సంక్షేమ పథకాల ద్వారా లక్ష కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసిందని మంత్రి అన్నారు. సంక్షేమము, అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న జగన్మోహన రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లుటలో మీడియాతో సమన్వయపరుచుకుని సమాచార శాఖాధికారులు పనిచేయాలని మంత్రి పేర్ని నాని అన్నారు.
ఈ సమావేశంలో సమాచార శాఖ జాయింట్ డైరెక్టరు కస్తూరి, తదితరులు పాల్గొన్నారు.