అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కల్యాణమస్తు కార్యక్రమంలో పెళ్లి చేసుకునే జంటలకు రెండు గ్రాముల తాళిబొట్లు ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. నిజానికి గ్రాము బరువున్న మంగళసూత్రాన్ని ఇవ్వాలని టీడీడీ తొలుత నిర్ణయించినప్పటికీ అంత తక్కువ బరువులో తయారుచేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో తాళిబొట్టు బరువును రెండు గ్రాములకు పెంచింది. ఈ ప్రతిపాదనకు టీటీడీ ధర్మకర్తల మండలి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. త్వరలో ప్రారంభం కానున్న కల్యాణమస్తు కార్యక్రమంలోనే వీటిని పేద జంటలకు ఇవ్వనున్నారు. మరోవైపు, వచ్చే నెలకు …
Read More »Andhra Pradesh
‘గ్రామ ఉజాలా’ పథకానికి కేంద్రం శ్రీకారం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ వినియోగదారులకు కేవలం రూ.10కి ఎల్‌ఈడీ బల్బును అందించే పథకానికి కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ శుక్రవారం శ్రీకారం చుట్టింది. ‘గ్రామ ఉజాలా’ పేరుతో చేపట్టిన ఈ పథకాన్ని తొలిదశలో అమలు చేసేందుకు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, మహారాష్ట్రలోని నాగపూర్, బిహార్‌లోని ఆరా, పశ్చిమగుజరాత్ ప్రాంతాలను ఎంచుకున్నారు. గ్రామీణులకు 7 వాట్లు, 12 వాట్లు గల మొత్తం 1.5 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ …
Read More »టిడ్కో ఇళ్లను కేటాయించండి…
-మున్సిపల్ కమిషనర్‌కు తెదేపా కార్పోరేటర్ల విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అపరిష్క్రతంగా ఉన్న టిడ్కో ఇళ్ల కేటాయింపుపై నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్లు మున్సిపల్ కమిషనర్‌తో చర్చించారు. 11వ డివిజన్ కార్పోరేటర్ కేశినేని శ్వేత నేతృత్వంలో టీడీపీ కార్పోరేటర్ల బృందం శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌ను నగర పాలక సంస్థ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంరద్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించారు. అనంతరం పలు అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా టిడ్కో ఇళ్లకు డిపాజిట్ చెల్లించిన …
Read More »కె.ఎల్.రావు మన బెజవాడ వాసులకు నిత్యస్మరణీయిలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒకప్పుడు సొరంగం త్రవ్వకముందు చిట్టినగర్ నుండి విద్యాధరపురం వెళ్ళాలంటే కొండెక్కి అవతల వైపుకు వెళ్ళేవారట. చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఎంత ప్రయాసో ఇప్పటికీ తెలుస్తూనే ఉంది. అప్పటి వారి ఓపికకు జోహార్లు పలకవచ్చు. 1964లో టన్నెల్ త్రవ్వడం వలన ఈ ప్రాంత వాసులకు ఆ ఇక్కట్లు తప్పాయి. దేశం గర్వించదగ్గ ఇంజనీరు, బెజవాడ నుండి నాలుగుసార్లు MP గా, కేంద్రమంత్రిగా ఎనలేని కీర్తిని ఆర్జించిన పద్మభూషణ్ కె.ఎల్.రావు పట్టుదల, ప్రతిభ కారణంగా అతి తక్కువ ఖర్చుతో రెండున్నర సంవత్సరాల …
Read More »మాజీ సైనికులకు న్యాయం జరగాలి
-ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మాజీసైనికులకు సరిఅయిన న్యాయం జరగడంలేదని ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు అన్నారు. ఈ సందర్భంగా ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు, ఉపాధ్యక్షులు సీతాదేవి, ప్రధాన కార్యదర్శి రెడ్డి, వరప్రసాద్, రత్నప్రసాద్, తిరుపతిరావు, గోవిందరావులు రాష్ట్ర డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ బ్రిగేడియర్ వెంకట్ రెడ్డిని కలిసి మాజీసైనిక సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మోటూరి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో …
Read More »ఈపీఎఫ్ లబ్ధిదారులకు సత్వర ప్రయోజనాలు
కార్మిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి రాష్ట్ర విభజన తరవాత తొలి ప్రాంతీయ కమిటీ సమావేశం ఈపీఎఫ్ ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు : ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్మిక భవిష్యనిధి ద్వారా లబ్ధిదారులకు రుణాలు, పింఛన్లు, పొదుపు సత్వరం అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ ఛైర్ పర్సన్ బి.ఉదయలక్ష్మి తెలిపారు. రాష్ట్ర విభజన తరవాత తొలిసారిగా సచివాలయంలో కార్మిక భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సమావేశం బుధవారం …
Read More »ఓం గం గణపతియే నమః
🌹గణపత్యథర్వశీర్షోపనిషత్🌹 🙏ఓం గం గణపతియే నమః🙏 దారిద్ర్యం మిమ్మల్ని వెంబడిస్తోందా? ఉద్యోగం దొరకడం లేదా? రాహు కేతు దోషమా? గ్రహానుకూలత లేదా? వచ్చిన డబ్బు నిలవడం లేదా? కుటుంబంలో ప్రశాంతత లేదా? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలా? మీ మాటకు విలువలేదా? తరచూ ప్రమాదాలకు గురిఅవుతున్నారా? సోదరులతో పేచీలా? నిద్రసరిగ్గా పట్టడం లేదా? పీడకలలా? స్థిరాస్తి తగాదాలా? విద్యావిఘ్నాలా? శతృభాదా? తరచూ అనారోగ్యమా? మనస్సు ఏకాగ్రత లేదా? వ్యాపారములో చికాకులా? రాజకీయాలలో రాణింపు లేదా? కుజ దోషమా? ఏల్నాటి శని దోషమా? కేతుదశా? జీవితం మీద …
Read More »