Breaking News

కె.ఎల్.రావు మన బెజవాడ వాసులకు నిత్యస్మరణీయిలు…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :  ఒకప్పుడు సొరంగం త్రవ్వకముందు చిట్టినగర్ నుండి విద్యాధరపురం వెళ్ళాలంటే కొండెక్కి అవతల వైపుకు వెళ్ళేవారట. చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఎంత ప్రయాసో ఇప్పటికీ తెలుస్తూనే ఉంది. అప్పటి వారి ఓపికకు జోహార్లు పలకవచ్చు. 1964లో టన్నెల్ త్రవ్వడం వలన ఈ ప్రాంత వాసులకు ఆ ఇక్కట్లు తప్పాయి. దేశం గర్వించదగ్గ ఇంజనీరు, బెజవాడ నుండి నాలుగుసార్లు MP గా, కేంద్రమంత్రిగా ఎనలేని కీర్తిని ఆర్జించిన పద్మభూషణ్ కె.ఎల్.రావు పట్టుదల, ప్రతిభ కారణంగా అతి తక్కువ ఖర్చుతో రెండున్నర సంవత్సరాల వ్యవధిలో సొరంగం పూర్తయిందట. అప్పట్లో ఆ టనెల్ త్రవ్వడాన్ని చాలామంది వ్యతిరేకించినా తరువాతి కాలంలో ఆయన దూరదృష్టికి జేజేలు పలికారు. కె.ఎల్.రావు మన బెజవాడ వాసులకు నిత్యస్మరణీయిలు.

Check Also

సమాజ సేవలో స్వచ్ఛంధ సంస్థలు భాగస్వామ్యం కావాలి

-కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లో “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *