Breaking News

Andhra Pradesh

మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్ స్వీయ పరీక్ష పోస్టర్లు విడుద ల చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి మంగళవారం స్థానిక కలెక్టరేట్లో మహిళ ల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ కు సంబంధించిన స్వీయ పరీక్ష పోస్టర్ ను ఆరోగ్యశాఖ , పరివర్తన స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులతో కలిసి విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కాన్స్టోరియమ్ ఆఫ్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సి – హాయ్ ) సంస్థ మరియు పరివర్తన స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా వ్యాప్తంగా మహిళ ల్లో బ్రెస్ట్ …

Read More »

ఉపాధి అవకాశాలు, ప్లేస్మెంట్ సద్వినియోగం చేసుకొని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జి.గణేష్ కుమార్, ఐఏఎస్ MD&CEO,Director,Technical Education, Director Employement &Trg, ఈరోజు తిరుపతిలోని SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ విచ్చేసి అక్కడ జరుగుతున్నటువంటి పీఎంకేవై 4.0, స్కిల్ హబ్ శిక్షణ సెంటర్ ని విజిట్ చేసి అక్కడ యువతతో ఇంట్రాక్ట్ అయి శిక్షణ జరుగుతున్నటువంటి విధానము అలాగే వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని వాళ్లకి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది, అలాగే శిక్షణ ఇస్తున్నటువంటి ట్రైనరు, ప్రిన్సిపల్, డిఎస్డిఓ ద్వారా పూర్తి …

Read More »

అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై కేటాయించిన విధుల్లో నిర్లక్ష్య వైఖరి కనబరచిన ఏఈ నాగవేణిని విధుల నుండి సస్పెండ్ చేసి ఈఎన్సీకి సిఫార్స్ చేయాలని ఎస్.ఈ.ని, ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు బొంతపాడు (194 వార్డ్ సచివాలయం) శానిటేషన్ కార్యదర్శి బి.బోడెయ్యను విధుల నుండి సస్పెండ్ చేయాలని సిఎంఓహెచ్ ని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ కెవిపి కాలనీ, …

Read More »

రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల తలసరి ఆదాయం రూ.నాలుగు లక్షలకు పెంచడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో పనిచేస్తుందని జిల్లా ఇంఛార్జి మంత్రి గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్లకు తొలిసారిగా వచ్చిన జిల్లా ఇంచార్జ్ మంత్రి పార్థసారథి మంగళవారం స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని జిల్లా ఇంఛార్జి మంత్రి అన్నారు. రూ.10.50 …

Read More »

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

-2028 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళిక -కొత్త డయాఫ్రం వాల్, ఈసిఆర్ఎఫ్ డ్యాం పనుల ప్రారంభం, పూర్తి చేసే సమయంపై చర్చ -1,396 మీటర్ల పొడవైన నూతన డయాఫ్రం వాల్ పనులు జనవరి నుంచి మొదలుపెట్టడానికి సన్నాహాలు -పోలవరం ఫలాలు అందించేందుకు ప్రతిరోజూ కీలకమేనన్న ముఖ్యమంత్రి చంద్రబాబు -సమస్యలను అధిగమించి…..సమన్వయంతో నిర్ధేశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తి చెయ్యాలని అధికారులకు, నిర్మాణ సంస్థలకు సిఎం సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రంగాలలో జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి పట్టాలపై బాపట్ల పయనిస్తుందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఆయన తొలిసారి బాపట్లకు రావడంతో అధికారులు, ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు సుదీర్ఘంగా …

Read More »

బాపట్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : బాపట్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి మంత్రి గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి మంగళవారం జిల్లాకు తొలిసారిగా రావడంతో ఘన స్వాగతం లభించింది. పీవీపాలెం యాజలి వద్ద గుంతల రహిత కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి కలిసి భూమి పూజ …

Read More »

నేషనల్ ఆర్ట్ ఫెస్ట్ లో సత్కారం అందుకున్న కళా దర్శకుడు రత్నాకర్

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ చిత్రకళా ఉత్సవం 2024 ప్రాచీన భారత్ పేరుతో ఒంగోలు అంబేద్కర్ భవనం లో ఆదివారం చిత్రకళా ఉత్సవం ప్రాచీన భారత్ జాతీయ చిత్ర కళా ప్రదర్శన, పోటీలు జరిగాయి. కార్యక్రమాన్ని కళా యజ్ఞ, నెస్ట్ మేకర్స్, సృష్టి ఆర్ట్ అకాడమి ల ఆధ్వర్యం లో నిర్వహించారు. కార్యక్రమం లో చిత్రకళా రంగం.లో సేవలందిస్తున్న ప్రముఖులను అతిధులుగా ఆహ్వానించి సత్కరించారు. తెనాలి పట్టణానికి చెందిన వరల్డ్ రికార్డు హోల్డర్, సినీ ఆర్ట్ డైరెక్టర్ కనపర్తి రత్నాకర్ ను …

Read More »

పౌర విమానయాన రంగంలో విజయాలు సాధించిన 51 మంది మహిళలతో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాటామంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పౌర విమానయాన రంగంలోని పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఫ్లైట్ డిస్పాచర్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, మెయింటెనెన్స్ ఇంజినీర్లు, ఎయిర్‌పోర్ట్ మేనేజర్లు, రెగ్యులేటర్లు సహా 51 మంది మహిళలు రాష్ట్రపతి కార్యాలయం నిర్వహించిన “ది ప్రెసిడెంట్‌ విత్‌ ది పీపుల్‌” చొరవలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు. ఆ మహిళల గౌరవార్ధం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మధ్యాహ్న విందు ఏర్పాటు చేసింది. వారితో, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముచ్చటించారు. …

Read More »

క్యాజువల్ న్యూస్ ఎడిటర్, క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేట‌ర్ గా దరఖాస్తులు ఆహ్వానం

ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ ఎడిటర్ (Casual News Editor), క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేట‌ర్ (Casual Newsreader cum Translator) గా పనిచేసేందుకు ఆస‌క్తి గల‌ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీసాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ నియామ‌కాలు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావ‌ని, పీఎఫ్, ఆరోగ్య ప‌థ‌కం, క్వార్ట‌ర్స్, పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని స్ప‌ష్టం చేశారు. క్యాజువల్ న్యూస్ ఎడిటర్ (తెలుగు) …

Read More »