Breaking News

Andhra Pradesh

వరి నుండి పామాయిల్ సాగుకు రైతులు ముందుకు రావాలి

-నల్లజర్లలో 125 ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ ప్రారంభించిన కలెక్టర్ కీర్తి చేకూరి నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. నల్లజర్ల గ్రామంలో 125 ఎకరాల్లో వరి సాగు నుండి పామాయిల్ సాగుకు పంట మార్పిడి కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం సాయంత్రం పామాయిల్ మొక్క నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4 …

Read More »

ప్రజలకు మందుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపు మేరకు 20-05-2026 న నిర్వహించబడనున్న దేశవ్యాప్త ఒకరోజు బంద్‌లో ఎన్‌టీఆర్ జిల్లా కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ మరియు ది కృష్ణా జిల్లా హోల్‌సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ పాల్గొననున్న నేపథ్యంలో, ప్రజలకు మందుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు. జిల్లాలోని ముఖ్య కేంద్రాలలో గుర్తించిన …

Read More »

టీమ్ ఎన్‌టీఆర్ కృషితో విజ‌య‌వంతంగా మ్యూజియం డే

– అధికారులు, భాగ‌స్వామ్య సంస్థ‌ల‌కు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అభినంద‌న‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో ఎన్నడూలేని విధంగా అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వామ్యమైన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, సాంస్కృతిక చారిత్ర‌క సంస్థల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందించారు. సోమవారం విజయవాడలోని బాపూ మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమాలు ప్రజల నుంచి విశేష స్పందన పొందాయని తెలిపారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ను ఆర్కియాల‌జీ అండ్ మ్యూజియమ్స్ శాఖ క‌మిష‌న‌ర్ పి.స‌రేష్, డిప్యూటీ డైరెక్ట‌ర్ …

Read More »

ప్ర‌తి చెరువుకూ ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌!

– ల‌క్ష్యాల‌కు అనుగుణంగా జ‌ల‌ధార ప‌నుల పూర్తికి కృషిచేయండి – ప‌నుల పురోగ‌తిపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ముఖ్యం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి చెరువు పరిస్థితిని పరిశీలించి, అవసరానికి అనుగుణంగా పూడికతీత, బండల బలపరిచే పనులు, కాలువల శుభ్రపరిచే కార్యక్రమాలు, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని.. జిల్లాలో చేప‌డుతున్న జ‌ల‌ధార ప‌నుల‌ను వేగ‌వంతం చేసి, నిర్దేశిత ల‌క్ష్యాల‌కు అనుగుణంగా స‌మ‌య‌పాల‌న‌తో పూర్తిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. క‌లెక్ట‌ర్ …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏపీ వక్ఫ్ బోర్డు రికార్డులు ఏపీ కు బదిలీ

-ఏపీ వక్ఫ్ బోర్డుకు రికార్డుల అప్పగింతలో కీలక అడుగు -పదేళ్లుగా పెండింగ్‌ లో ఉన్న రికార్డుల సమస్య పరిష్కారం దిశగా అడుగులు -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్ జోక్యంతో సానుకూల పరిణామం -రికార్డులతో పాటు బకాయి నిధుల సాధన కూ చర్యలు -ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఏపీ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన కీలక రికార్డులు, ఫైళ్లు, సర్వే ఫారం లు, జిల్లా …

Read More »

మంత్రి నారా లోకేష్ ని కలిసిన నెట్టెం రఘురాం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఉండవల్లి నివాసంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మర్యాదపూర్వకంగా కలిసి, నూతనంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, యువతకు స్ఫూర్తిదాయక నాయకుడిగా ముందుకు సాగుతున్న నారా లోకేష్ దూరదృష్టి, కార్యదీక్ష, ప్రజాసంకల్పాన్ని ప్రత్యేకంగా …

Read More »

జాతీయస్థాయిలో వ్యర్ధాల నిర్వహణపై ఉత్తమ విధానాలను ప్రదర్శించిన విఎంసి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయస్థాయిలో వ్యర్ధాల నిర్వహణపై ఉత్తమ విధానాలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రదర్శించారు. మంగళవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్‌పై నిర్వహించిన జాతీయ స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. గత సమావేశంలో వ్యర్థపదార్థాల నిర్వహణలో విజయవాడ నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను జాతీయ స్థాయిలో ప్రదర్శించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ సూచించిన …

Read More »

వర్షాకాలానికి ముందస్తు చర్యలు

-విజయవాడ శివారు ప్రాంతాల్లో లాంగ్ ఆర్మ్ తో గుర్రపు డెక్కల తొలగింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వర్షాకాలం దృశ్య నగరంలోని కాలువల్లో ఎటువంటి అంతరాయం లేకుండా నీరు ప్రవాహం ఉండాలి అంటే నగర శివారులో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నీరు ప్రవహించేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశించగా, మంగళవారం ఉదయం అంబాపురం పరిసర ప్రాంతాల్లో గల కాలువలో ఉన్న గుర్రపు డెక్కలను లాంగ్ ఆర్మ్ తో ప్రజారోగ్యం సిబ్బంది తొలగించారు.

Read More »

చెత్త కాదు… నగరానికి సంపద

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో సేకరించే వ్యర్ధాలు కేవలం వ్యర్ధాలు మాత్రమే కావని, అవి నగరానికి సంపదని వ్యర్ధాల నుంచి సంపద తయారీకి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగర పర్యటనలో భాగంగా బందర్ రోడ్, పటమట, ఎలక్ట్రిసిటీ కాలనీ, యనమలకుదురు రోడ్ ప్రాంతాలను సందర్శించి పారిశుధ్య నిర్వహణ, తడి చెత్త సేకరణ మరియు వర్మీ కంపోస్ట్ తయారీ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ …

Read More »

విజయవాడ నగర ప్రజల భద్రత కోసం ప్రత్యేక చర్యలు – మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, క్రీడా ప్రాంగణాలు వంటి ప్రజా రద్దీ ప్రాంతాలలో వీధి కుక్కల సంచారం మరియు కుక్క కాట్ల నివారణపై సమీక్ష సమావేశాన్ని విజయవాడ మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన ఈ రోజు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO), జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), రైల్వే మరియు బస్టాండ్ నోడల్ అధికారులు, ప్రభుత్వాసుపత్రి ప్రతినిధులు, వీఎంసీ చీఫ్ మెడికల్ …

Read More »