Breaking News

Andhra Pradesh

పేదల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ ధ్యేయం

-ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్వోసీలను మంగళవారం, భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. 40 వ డివిజన్ బాల భాస్కర్ నగర్ కు చెందిన గడ్డం సారమ్మ హృద్రోగానికి సంబంధించి రూ 4 లక్షల ఎల్ ఓ సీ ను, 47 వ డివిజన్ కు …

Read More »

డాక్టర్ వైయస్సార్ స్పోర్ట్స్ స్కూల్ నందు సీట్లు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాదికారసంస్థల ద్వారా వైయస్సార్ జిల్లా పుట్టంపల్లి నందు నడపబడుతున్న డాక్టర్ వైయస్సార్ స్పోర్ట్స్ స్కూల్ నందు 2026-27 సంవత్సరానికి గాను 4 నుండి 9 వతరగతుల నందు ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ నందు అప్లికేషన్స్ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా 4 నుండి 6 వ తరగతుల వరకు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో మరియు …

Read More »

ఏపీ ఛాంబర్స్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో ‘వెడ్డింగ్ ట్రూసో & లగ్జరీ హాంపర్స్’ పై మాస్టర్ క్లాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఛాంబర్స్ సెంట్రల్ జోన్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో విజయవాడలో ‘వెడ్డింగ్ ట్రూసో & లగ్జరీ హాంపర్స్’ (వివాహ సామగ్రి ప్యాకింగ్ మరియు ప్రీమియం బహుమతుల అలంకరణ) పై ప్రత్యేక మాస్టర్ క్లాస్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా పారిశ్రామికవేత్తలు, గృహిణులు, సృజనాత్మక రంగ నిపుణులు మరియు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే మహిళలు అత్యుత్సాహంగా పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో ఆకర్షణీయమైన ట్రూసో ప్యాకింగ్ పద్ధతులు, లగ్జరీ హాంపర్ స్టైలింగ్, సృజనాత్మకతతో కూడిన పర్సనలైజేషన్, ప్రీమియం ప్రెజెంటేషన్ …

Read More »

మత్స్యకార కుటుంబాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామం నుండి లాంఛనంగా ప్రారంభించారు. మత్స్యకార సేవలో పథకం క్రింద చేపల వేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 2026-27 సంవత్సరానికి సంబంధించి తిరుపతి జిల్లాలో 3,099 మంది మత్స్యకారులకు మొత్తం రూ.6.198 కోట్లు డీబీటీ ద్వారా వారి ఖాతాల్లో నేరుగా …

Read More »

పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత సలహాలు, సూచనలు ప్రత్యేక కౌంటర్ లో సమర్పించాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న 57 ఎన్నికల వార్డులను 76 వార్డులుగా పెంపుదల చేసిన పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను సోమవారం ప్రచురించామని, అందులో ఏమైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ప్రతి రోజు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని సిటి ప్లానర్ కార్యాలయంలో ప్రత్యేకంగా …

Read More »

అభివృద్ధి పనులపై ఆదేశాలు జారీ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులను ఆధునికమైన మౌలిక వసతులతో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ సిఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. మంగళవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి నగరంలోని కాకాని రోడ్, విఐపి రోడ్, ఆర్టీసి బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ సర్కిల్ నుండి కంకర గుంట ఆర్ఓబీ వరకు, విద్యా నగర్ రోడ్ లను పరిశీలించి, అభివృద్ధి పనులపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ …

Read More »

జన గణనను తనిఖీ చేసిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జనాభా గణనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని జిల్లా ప్రిన్సిపాల్ సెన్సస్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ పిలుపునిచ్చారు. గుంటూరు మండలం బుడంపాడులో జన గణనను జిల్లా కలెక్టర్ మంగళ వారం తనిఖీ చేశారు. క్షేత్ర స్థాయిలో చేపడుతున్న ప్రక్రియ, వేగవంతం చేయుటకు అవకాశాలు పరిశీలించారు. ఇళ్ళ వద్ద ఆయా యజమానులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు మే 1వ తేదీన తమకు కేటాయించిన ఇళ్లను …

Read More »

మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, చేపల వేట నిషేధ కాలంలో 1,30,000 మంది మత్యకారులకు 286 కోట్ల రూపాయలు వేట నిషేధ భృతిని మంజూరు చేసి ఆదుకుంటూ ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో ప్రారంభించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా జిల్లా నుండి నగరంలోని కలెక్టరేట్ వి.సీ. హాలులో ఏర్పాటు చేసిన …

Read More »

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం షెడ్యూల్ ను భారత్ ఎన్నికల సంఘం ప్రకటించినదని, వచ్చే జూన్ 15వ తేదీ నుండి బిఎల్వోలు ఇంటింటికి తిరిగి ఓటర్ నమోదు కార్యక్రమం చేపడతారని ఆలోగా అందరూ బిఎల్ఎ లను నియమించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని డీకే బాలాజీ వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి సాంబార్లో ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రత్యేక …

Read More »

ఈనెల 22న గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళా..

-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.22.05.2026 శుక్రవారం నాడు ఉదయం 09:00 గంటలకు గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్  డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో ఎఫ్ట్రానిక్స్, ఫస్ట్సోర్స్ సొల్యూషన్స్, హెటిరో ల్యాబ్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్, ముత్తూట్ ఫైనాన్స్, జోయాలుక్కాస్, కురాకు ఫైనాన్సియల్ …

Read More »