విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి, శరన్నవరాత్రుల్లో భాగంగా 4వ రోజైన బుధవారం ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది. జగజ్జననీ అయిన శ్రీమహాలక్ష్మీ రూపంలో ఉన్న దుర్గామాత ఈ రోజున ఎరుపు రంగు దుస్తుల్లో భక్తులను సాక్షాత్కరిస్తుంది. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా.. అంటే సమస్త జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి.. అని చండీ సప్తశతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి సర్వమంగళ కారిణిగా ధన, ధాన్య, ధైర్య, …
Read More »Devotional
జులై 3న పౌర్ణమి గరుడ సేవ
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జులై 3న గరుడసేవ జరుగనుంది. ఈ రోజు గురు పౌర్ణమి కావడం విశేషం.ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
Read More »పంచ రంగనాధ క్షేత్రాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జలం ఏ పాత్రలోకి ఒంపితే, ఆ రూపాన్ని పొందుతుంది. భగవంతుడు కూడా అంతే! భక్తులు ఏ రూపంలో ఆయనను కొలుచు కోవాలనుకుంటే…. ఆ రూపంలోకి ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించే విష్ణుమూర్తిని, రంగనాథస్వామిగా కొల్చుకోవడం కద్దు. దక్షిణాదిన ఈ రంగనాథ స్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో పంచరంగ క్షేత్రాల గురించి చెప్పుకోవాల్సిందే. కావేరీ తీరాన వెలసిన ఈ పంచరంగ క్షేత్రాలు తమిళ, కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకం. ఆ పంచరంగ క్షేత్రాల వివరాలు ఇవిగో… …
Read More »యూకే మరియు యూరప్ దేశాలలో కన్నులపండుగలా శ్రీ మలయప్పస్వామి వారి కళ్యాణోత్సవాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యూకే మరియు యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ తేదీ వరకు పదకొండు (11) నగరాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహిస్తున్న విషయం విదితమే. వైఖానస ఆగమం ప్రకారం తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేదపండితులు తిరుమల నుండి తీసుకెళ్ళిన స్వామి, అమ్మవారి మూర్తులకు సంప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ట చేసి శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. అశేష సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి …
Read More »శ్రీవారి ఆలయ నిర్మాణం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది. శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచు కోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి. ఆలయంలోని నిర్మాణాలు ఇలా ఉంటాయి 1 వ ప్రాకారం …
Read More »ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి చేయు అలంకారాలు, కట్టే చీర రంగు, నైవేద్యం వివరాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పది రోజుల పాటు ఈ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. శ్రీ దేవీ శరన్నవరాత్రులలో అమ్మవారికి చేయు అలంకారాలు, కట్టే చీర రంగు, నైవేద్యం వివరాలు.. 26-09-22 సోమవారం-పాఢ్యమి-స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి-బంగారు రంగు చీర-కట్టెపొంగలి, చలిమిడి, వడపప్పు, పాయసం27-09-22 మంగళవారం-విదియ-శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి-లేత గులాబీ రంగు చీర-పులిహార..28-09-22 బుధవారం-తదియ-శ్రీ గాయత్రీ దేవి-కాషాయ లేదా నారింజ రంగు చీర- కొబ్బరి అన్నం , కొబ్బరి …
Read More »వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం
-అలిపిరి పాదాలమండపం వద్ద ఘనంగా మెట్లపూజ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శనివారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను …
Read More »ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 17వ తేదీ సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, గ్రంధి …
Read More »తిరుమలలో ఆగస్టు 19న గోకులాష్టమి ఆస్థానం, 20న ఉట్లోత్సవం
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 19వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 7 నుండి 9 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు. ఆగస్టు …
Read More »శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో ఎల్లమ్మ – జగద్ అగ్ని మునిరాజుల కళ్యాణం
-కన్నుల పండుగగా వీక్షించిన భక్తులు -మహా అన్నదాన కార్యక్రమం ఖమ్మం నేటి పత్రిక ప్రజావార్త : శ్రావణ మాసం రెండోవ మంగళవారం పురస్కరించుకుని కాల్వొడ్డు మున్నేరు ప్రాంతంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో ఎల్లమ్మ – జగద్ అగ్ని మునిరాజుల కళ్యాణాని ఆలయ పూజారి ఉప్పిసాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గత పది సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ, ఇల్లందు చుట్టూ పక్కాల తీరుప్రాంతాల నుండి ప్రజలు పాల్గొని కన్నుల పండుగగా …
Read More »