Breaking News

అప్పన్న స్వామికి చందన సమర్పణ

సింహాచలం, నేటి పత్రిక ప్రజావార్త :
వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో అప్పన్న స్వామికి రెండో విడత చందన సమర్పణ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున రెండు గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రభాత సేవలు నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ముందుగా సిద్ధం చేసుకుని ఉంచిన శ్రీ గ్రంధాన్ని స్వామికి సమర్పణ చేశారు. వైశాఖ పౌర్ణమి ఉత్సవం నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అడివివరంలోని వరాహ పుష్కరిణి చెరువు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు సింహాచలం ఈవో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *