Breaking News

Latest News

పట్టాభి రామ్ వైసిపి దుర్మార్గాలను ధీటుగా ఎదుర్కొన్నాడు

-ఎం ఎల్ ఎ సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి ) కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ తో కలిసి అభినందనలు తెలిపారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం లో సోమవారం నిర్వహించిన పట్టాభిరామ్ అభినందన సభలో సుజనా చౌదరి పాల్గోన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వైసిపి ఐదేళ్ల పాలనలో ప్రజా ప్రతినిధులకు వాక్ స్వాతంత్ర్యం లేకుండా చేశారన్నారు.వైసిపి …

Read More »

ఏపి మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

-వెలువెత్తిన అభిమానం -భారీగా తరలివచ్చిన జనసైనికులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావు ఏపి మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గా మంగళగిరి ఆటోనగర్ లోని APMSIDC కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. చిల్లపల్లి శ్రీనివాసరావు నివాసం వద్ద నుంచి పాదయాత్ర గా అంబేద్కర్ సెంటర్ కు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి మంగళగిరి లోని ఏపి మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యాలయం వరకు భారీ …

Read More »

ఇళ్ల స్థలాల కోసం సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సామూహిక అర్జీలను సమర్పించిన పేదలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర వ్యాప్తి పిలుపుమేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో గ్రామ/వార్డు సచివాలయాల వద్ద పేదలు సామూహిక అర్జీలు సమర్పించి, చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు జయప్రదంగా జరిగాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు; బాపట్ల జిల్లా …

Read More »

నవంబర్ 18 నుండి డిసెంబర్ 2, 2024 వరకు పీఎం స్వానిధి క్యాంపెయిన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విధి వ్యాపారస్తులను ఆదుకునేందుకు, ఆర్థిక స్థితిని పెంచేందుకు కల్పించే ప్రధానమంత్రి స్వానిధి పథకం క్యాంపెయిన్ 15 రోజులు నిర్వహించి వీధి వ్యాపారస్తులను బలోపేతం చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ మీద నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ జాయింట్ సెక్రెటరీ …

Read More »

సత్వర పరిష్కారాలను అందించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందే ప్రతి ఫిర్యాదుకు సత్వర పరిష్కారాలు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నగర కమిషనర్ సోమవారం ఉదయం 10 గంటల నుండి నిర్వహించారు. నగర పరిధిలో గల వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆ సమస్య …

Read More »

మ్యాప్ల ఆధారంగా డ్రైన్లు శుభ్రపరచండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ్యాప్ ల ఆధారంగా డ్రైన్ లు పరిశుభ్రపరచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 9వ డివిజన్ బెంజ్ సర్కిల్ నుండి స్క్రూ బ్రిడ్జ్ వరకు సర్వీస్ రోడ్లో కమిషనర్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైడ్ డ్రైన్లో పూడికలను ఎప్పటికప్పుడు తీసివేయాలని, వర్షపు నీటి నిలువలు రోడ్డుపైన నిలువకుండా ఉండేందుకు సైడ్ కాలవలను పరిశుభ్రంగా ఉంచాలని, …

Read More »

కాశీ విశ్వేశ్వరుని సేవలో మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక మాసంలో భాగంగా సోమవారం గవర్నర్ పేటలోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామున 3 గంటల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముక్కంటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కైలాసనాథునికి సుగంధ‌ద్రవ్యాలతో అభిషేకం చేశారు. కార్తీక సోమవారం పర్వదినాన కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని …

Read More »

బుడమేరు వరదల వల్ల డేమేజ్ అయిన కాలువను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 42వ డివిజన్ పరిధిలోని శివాలయం సెంటర్లో లలితా నగర్ వెళ్లే మెయిన్ రోడ్డు నందు గతంలో వచ్చిన బుడమేరు వరదల వల్ల డేమేజ్ అయిన కాలువను పరిశీలిస్తున్న మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ బ్రహ్మారెడ్డి, త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎంపీ కేశినేని చిన్ని దృష్టికి తీసుకు వెళ్లి కలువ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 44 వ బూత్ ఇంచార్జి నాగభూషణం, 46 వ బూత్ ఇంచార్జి బోయపాటి …

Read More »

మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ, అమరావతి సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ వేణు నాదెళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పంజా సెంటర్లో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అతిథులుగా పాల్గొని ప్రారంభించిన ఈ వైద్య శిబిరానికి దృష్టిలోప సంబంధ బాధితులు భారీగా తరలివచ్చారు. మానవతా దృక్పథంతో ఉచిత కంటి వైద్య …

Read More »

వరదల పేరుతో వడ్డనకు సిద్దమైన కూటమి ప్రభుత్వం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరదల పేరుతో ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం వడ్డనకు సిద్దమైందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. రాష్ట్ర జీఎస్టీపై 1 శాతం అదనం సర్ ఛార్జీని విధించేందుకు వెసులుబాటు కల్పించాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్రం నుంచి రావలసిన నిధులు రాబట్టడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. అది చేతగాక ప్రజలపై అదనపు భారం మోపడం …

Read More »