విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ విజయవాడ నగర కేంద్రంలో యువతకు అందుబాటులోకి రావడం సంతోషదాయకమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీ తోటవారి వీధిలో విజయదర్శని ఐఏఎస్ అకాడమీని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఒకప్పుడు ఐఏఎస్ కోచింగ్ అంటే హైదరాబాద్, బెంగుళూరు వెళ్లవలసి ఉండేదని.. ఆ ప్రాంతాలకు ధీటుగా …
Read More »Latest News
గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఆనందయ్య కరోనా మందు పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, విజయవాడ చిరంజీవి యువత అధ్యక్షులు కటికి రాకేష్ నాథ్ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, భానునాగర్, శ్రీనగర్ కాలనీ, గులాబితోట లో కృష్ణ పట్టణం బొనిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో, 45 వయస్సు పైబడిన 2000 మందికి, కృష్ణ పట్టణం బొనిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎం.శ్రీనివాసరావు, రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య దంపతులు, పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు కిలారి రోశయ్యలు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం, పంచహారతుల సేవలో పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి పంచహారతుల సేవానంతరము వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, శ్రీ అమ్మవారి ప్రసాదములు, …
Read More »పునరావాస పనులు వేగవంతం చేయండి : జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి
-భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణపై సమీక్ష విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం గ్రీన్‌ఫీల్డు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసేందుకు వీలుగా నిర్వాసితుల పునరావాస పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. నిర్వాసితుల కాలనీల నిర్మాణం, అక్కడ అవసరమైన సామాజిక వసతుల కల్పన వంటి పనులు త్వరగా పూర్తిచేసినట్లయితే నిర్వాసితులు తమ గ్రామాలను ఖాళీ చేసే అవకాశం ఉంటుందని, ఎయిర్ పోర్టు పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లా …
Read More »అర్హులందరికీ “నేతన్న నేస్తం”…
-ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు -ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక -చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు, ఉత్పత్తి ధరలకే విక్రయాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకం అర్హులైన ప్రతి నేత కార్మికుడికి చేరాలని ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు అన్నారు. విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో శనివారం చేనేత జౌళిశాఖ సంచాలకులు పడాల అర్జునరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నేతన్న నేస్తం లబ్ధిదారుల …
Read More »స్టేట్ లిటిగేషన్ పాలసీని సమర్థ వంతంగా అమలుచేస్తే జాప్యం లేకుండా కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం…
-ఈ పాలసీని సమన్వయం,టైం బౌండ్ విధానంలో నిర్వహిస్తే కోర్టులపై ప్రభుత్వ లిటీగేషన్ల భారం తగ్గుతుంది… -ఎపి ఆన్ లైన్ లీగల్ కేసు మేనేజ్మెంట్ సిస్టమ్ (APOLCMS) ప్రవేశ పెట్టడం ద్వారా వివిధ కేసుల డేటాబేస్ నిర్వహణకు అవకాశం… -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా తీసుకురానున్న స్టేట్ వ్యాజ్యం (Litigation) పాలసీని సమర్థ వంతంగా అమలు చేస్తే జాప్యం లేకుండా కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ …
Read More »ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించండి… : డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల పర్యటన సందర్భంగా ఢిల్లీ వచ్చిన రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిన్న కేంద్ర టూరిజం, సంస్కృతి మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి మరియు కేంద్ర ఫుడ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి పశుపతి కుమార్ పరస్ లను కలిసి ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన వివిధ అంశాల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్రం వ్యవసాయం పై ఆధారపడి …
Read More »బధిరులకు బాసటగా జగనన్న ప్రభుత్వం : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గొప్ప భాషా పండితుల బిడ్డయినా అడవిలో తప్పిపోయి అక్కడే పెరిగితే మాటలు రాని ‘టార్జాన్’ మాత్రమే కాగలడని అవకాశాలు ఇస్తే చెవిటి, మూగ దివ్యాంగులు తమ సత్తా ఏమిటో లోకానికి చూపి తాము ఎందులో తక్కువ కాదని నిరూపించగలరని, బధిరులకు బాసటగా జగనన్న ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వక్కాణించారు. శనివారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ …
Read More »నాగార్జున సాగర్ నుండి వరద నీటి విడుదల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఆర్ డివో
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది ఇప్లో పెరుగుతున్నందున ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం నాగార్జున సాగర్ నుండి 5 లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నందున బందరు డివిజను పరిధిలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు బందరు ఆర్ డివో ఎన్ఎస్ కె. ఖాజావలి తెలిపారు. శనివారం తాసిల్దార్లు, రెవిన్యూ, పోలీసు అధికారులతో ఆర్ డివో టెలికాన్ఫరెన్సు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. …
Read More »సబ్ కలెక్టర్ జి. ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సబ్ కలెక్టరు విజయవాడ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐ.ఏ.ఎస్. శనివారం విజయవాడ వాంబే కాలనీ లోని 262- వార్డు సచివాలయం మరియు న్యూ ప్రకాష్ నగర్ 268, 269 వార్డు సచివాలయములను ఆకస్మికముగా తనిఖీ చేసారు. తనిఖీలో సచివాలయముల యందు సరి అయిన ప్రదేశములో అందరకు కనపడునట్లు డిస్ ప్లే బోర్డులు వుంచగలందులకు , అందరు వాలంటీర్ సిబ్బంది, సరియైన నిర్ణీత వస్త్రధారణ, సచివాలయం సిబ్బంది , సచివాలయం వదలి వెల్లునప్పుడు, మరియు వారి ఇన్ …
Read More »