ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎం.శ్రీనివాసరావు, రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య దంపతులు, పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు కిలారి రోశయ్యలు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం, పంచహారతుల సేవలో పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి పంచహారతుల సేవానంతరము వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటoను అందజేశారు.
