Breaking News

Latest News

ట్రాఫిక్ నియంత్రణ కొరకు ట్రావెల్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ట్రాఫిక్ నియంత్రణ కొరకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో ట్రాఫిక్ సిబ్బంది, ట్రావెల్స్ అసోసియేషన్ సభ్యులతో ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రోడ్డు మీద నిలిపివేయకుండా ప్రజలకు ట్రాఫిక్ సంబంధిత అంతరాయం కలగకుండా ఉండేందుకు, ట్రాఫిక్, విజయవాడ నగరపాలక సంస్థ మరియు ట్రావెల్స్ నుండి సంయుక్తంగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా …

Read More »

గుంతల రహిత జిల్లా లక్ష్యంగా రహదారుల అభివృద్ధి… : జిల్లా కలెక్టర్

కేసరపల్లి (గన్నవరం), నేటి పత్రిక ప్రజావార్త : గుంతల రహిత జిల్లా లక్ష్యంగా రహదారుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ (మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ) కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం గన్నవరం మండలంలోని కేసరపల్లి గ్రామంలో ఆయన స్థానిక కూటమి నాయకులు, ఇతర అధికారులతో కలిసి రహదారుల మరమ్మతులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గుంతల రహిత …

Read More »

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కె.యస్.ఆర్.పి జడ్.పి స్కూలు విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ డిస్ట్రిక్ట్ 3020 ఆద్వర్యంలో పటమట లంక నందు గల కె.యస్.ఆర్.పి జడ్.పి స్కూలు నందు ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు చేయడం జరిగింది. ఈ సందర్బంగా డాక్టర్ వి.శ్రీదేవి ప్రసాద్, అధ్యక్ష్యులు, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మాట్లాడుతూ “దృశ్యం ఐ కేర్ ప్రాజెక్ట్” ద్వారా ఈ కార్యక్రమాన్ని రూపొందించారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం 26 ప్రారంబించామని, ఇప్పటి వరకు ఎ.పి.యన్.ఆర్.యమ్, వి.యమ్.ఆర్.సి, యన్.వి.ఆర్. యమ్.సి, కె.యస్.ఆర్. …

Read More »

పార్ట్ టైమ్ న్యూస్ కరస్పాండెట్లు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ప్రాంతీయ వార్తా విభాగానికి అమరావతి రాజధాని ప్రాంతం, శ్రీసత్యసాయి జిల్లాలో పార్ట్ టైమ్ న్యూస్ కరస్పాండెట్లు (Part Time Correspondent)గా పనిచేసేందుకు ఆస‌క్తి గల‌ స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి సాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. పార్ట్ టైమ్ కరస్పాండెంట్ అనేది కేవ‌లం పార్ట్ టైమ్ అసైన్‌మెంట్ మాత్ర‌మే అని, శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాద‌ని,పీఎఫ్, ఆరోగ్య ప‌థ‌కం, క్వార్ట‌ర్స్, పెన్షన్ …

Read More »

క్యాజువల్ న్యూస్ ఎడిటర్, క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ట్రాన్స్ లేట‌ర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ ఎడిటర్ (Casual News Editor), క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ట్రాన్స్ లేట‌ర్ (Casual Newsreader cum Translator)గా పనిచేసేందుకు ఆస‌క్తి గల‌ అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి సాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ నియామ‌కాలు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావ‌ని, పీఎఫ్, ఆరోగ్య ప‌థ‌కం, క్వార్ట‌ర్స్, పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని స్ప‌ష్టం చేశారు. క్యాజువల్న్యూస్ ఎడిటర్ …

Read More »

క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ట్రాన్స్ లేట‌ర్, క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ట్రాన్స్ లేట‌ర్ (Casual Newsreader cum Translator), క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ (Casual Broadcast Assistant)గా పనిచేసేందుకు ఆస‌క్తి గల‌ అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి సాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ నియామ‌కాలు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావ‌ని,పీఎఫ్, ఆరోగ్య ప‌థ‌కం, క్వార్ట‌ర్స్, పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని స్ప‌ష్టం చేశారు. క్యాజువల్ న్యూస్ …

Read More »

పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ: మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి.. తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు అజరామరమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి మల్లాది విష్ణు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ.. భాషా …

Read More »

మూలపేట పోర్టు ప్రాంతంలో రూ.10 వేల కోట్లతో పారిశ్రామికాభివృద్ధి

-ఇంటికో పారిశ్రామికవేత్త రావాలి -టెక్కలి లేదా పలాసలో విమానాశ్రయం -ఈదుపురం గ్రామంలో దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో వెల్లడించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీకాకుళం/ఈదుపురం, నేటి పత్రిక ప్రజావార్త : మూలపేట పోర్టు ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతంలో పది వేల కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించిన …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆస్తులకు రక్షణ

-దేవాదాయ ఆస్తులను కాపాడేందుకు వక్ఫ్ ఆస్తుల రక్షణ తరహాలో కార్యాచరణ చేపట్టే యోచన -సుమారు 60 వేల ఎకరాల మేర ఎండోమెంట్స్ ఆస్తులు అన్యాక్రాంతం, ఆక్రమణ -ఐ.ఎస్.జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్తులకు రక్షణ -దేవాదాయ శాఖ కమిషనర్, ఏలూరు జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  దిశా నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలకు, ధర్మ సత్రాలకు ఉన్న ఆస్తులను రక్షించే బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  అధికారులకు స్పష్టం చేశారు. …

Read More »

ఈదుపురంలో దీపం వెలుగులు

-ఏడాదికి మూడు సిలిండర్లు పంపిణీ ప్రారంభించిన ముఖ్యమంత్రి -ఇచ్చాపురంలో ఘన స్వాగతం పలికిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు -దీపం పథకం లబ్ధిదారు శాంతమ్మ ఇంట్లో టీ తయారుచేసిన సీఎం శ్రీకాకుళం/ ఇచ్చాపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం 2.O పథకానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం మూడు 12.45 నిమిషాలకు హెలికాప్టర్లో ఆయన ఈదుపురం చేరుకున్నారు. అక్కడ …

Read More »