Breaking News

ట్రాఫిక్ నియంత్రణ కొరకు ట్రావెల్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ట్రాఫిక్ నియంత్రణ కొరకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో ట్రాఫిక్ సిబ్బంది, ట్రావెల్స్ అసోసియేషన్ సభ్యులతో ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రోడ్డు మీద నిలిపివేయకుండా ప్రజలకు ట్రాఫిక్ సంబంధిత అంతరాయం కలగకుండా ఉండేందుకు, ట్రాఫిక్, విజయవాడ నగరపాలక సంస్థ మరియు ట్రావెల్స్ నుండి సంయుక్తంగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ట్రాఫిక్ అడిషనల్ డిసిపి ప్రసన్న కుమార్, ఇతర ట్రాఫిక్ సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బస్ ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *