-భవానీలు, భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో చివరి రోజైన “విజయదశమి” సందర్భంగా శ్రీ అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరాజరాజేశ్వరీదేవి అవతారంలో వున్న అమ్మవారిని దర్శించుకొంటే అంతా జయమే కలుగుతుందని వేదాలలో చెప్పబడింది. తెల్లవారుజామునుండే భక్తులు అమ్మవారి దర్శించుకొనేందుకు భక్తులు బారులు తీరారు. రాష్ట్రం నలుమూలల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల నుండి భవానీ దీక్షాదారులు అమ్మవారిని దర్శించుకొనేందుకు బారులు తీరారు. దీనితో క్యూలైన్లు భక్తులతోపాటు …
Read More »Telangana
విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై ఘనంగా విజయదశమి వేడుకలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై విజయదశమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర స్వామి వారికీ అభిషేకం, అనంతరం అలంకరణ, అష్టోత్తర శతనామార్చన ఎంతో వైభవంగా జరిగాయి. విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై శమిపూజ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. వెంకటేశ్వర స్వామి వారు హస్వ వాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చారు.
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు తితిదే ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధికి చేరుకున్న సీజేఐ తొలుత మూలమూర్తిని దర్శించుకుని రంగనాయకుల మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ జస్టిస్ ఎన్వీ రమణకు వేద పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్ధప్రసాదాలను, చిత్ర పటాలను అందజేశారు. సీజేఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, …
Read More »గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు…
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దసరా పండుగ సందర్భంగా ఊరు ఊరు కో జమ్మిచెట్టు గుడి గుడి కో జమ్మిచెట్టు కార్యక్రమంలో భాగంగా విజయదశమి పర్వదినాన విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి జమ్మిచెట్టు ను నాటారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో విజయదశమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.దసరా పర్వదినాన శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు విజయదుర్గ అవతారంలో దర్శనమిచ్చింది. షడ్భుజి …
Read More »హంసవాహన తెప్పోత్సవ కార్యక్రమానికి సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హంసవాహన తెప్పోత్సవ కార్యక్రమానికి సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. దుర్గా ఘాట్ ఇరిగేషన్ మోడల్ గెస్టుహౌస్లో గురువారం ఇరిగేషన్ , టూరిజం, రెవిన్యూ, పోలీస్, ఫైర్, మత్స్యశాఖ అధికారులతో తెప్పోత్సవం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జె. నివాస్ సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణానదిలో నీటి సామర్ధ్యం ఎక్కువగా ఉన్నందున ఈ ఏడాది దుర్గాఘాట్లోనే నిలకడగానే ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దుర్గాఘాట్లో పరిమితి సంఖ్యలో ప్రొటోకాల్ …
Read More »ఉన్నత విద్యలో విద్యాదీ వెనె, వసతిదీ వెనెల పధకాలతో రూ. 4 వేలకోట్ల ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లింపు…
-గత ప్రభుత్వ బకాయిలు రూ. 1840 కోట్లు చెల్లింపు.. -2019-20 కు రూ. 2200 కోట్లు చెల్లింపు.. -సీనియర్ విద్యార్ధులకు మరో రూ. 770 కోట్ల ఫీజు రీఎంబర్స్ మెంట్… -ఫీజురీఎంబర్స్ మెంట్ విషయంలో ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు సంతృప్తిగా ఉన్నాయి… -కరోనాకాలంలో కళాశాలలు నిలబడ్డాయంటే సియం జగన్మోహన రెడ్డి గారు కారణం.. -మొదటిక్వార్టరులో 91.2 శాతం కళాశాలలకు ఫీజులు చెల్లింపు… -రెండవ క్వార్టరులో ఇప్పటికే 42.2 శాతం చెల్లింపు.. -రాష్ట్రంలో ఉన్నత విద్యలో 87 శాతం విద్యార్ధులకు పూర్తిగా ఫీజు రీఎంబర్స్ మెంట్ …
Read More »టిటిడి నుంచి దుర్గామల్లేశ్వర స్వామివార్లకు మేల్ చాట్ పట్టువస్త్రాలు సమర్పణ…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టిటిడి ఇవో కె.ఎస్.జవహర్ రెడ్డి, అడిషనల్ ఇవో దర్మారెడ్డి వారి తరపున ప్రతినిధులుగా టిటిడి దేవస్థానం పేష్కార్ సూపరింటెండెంట్ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లకు మేల్ చాట్ పట్టువస్త్రాలను సమర్పించారు. టిటిడి నుంచి వచ్చిన ప్రతినిధులను ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా …
Read More »హంస వాహన తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం నిర్వహించే హంస వాహన తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన తెప్పోత్సవానికి చేపట్టిన ఏర్పాట్లపై ఇరిగేషన్, రెవిన్యూ, పోలీస్, మత్స్య శాఖ, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో గురువారం ఇరిగేషన్ మోడల్ గెస్టుహౌస్లో జిల్లా కలెక్టర్ జె. నివాస్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది తెప్పోత్సవాన్ని దుర్గాఘాట్లో గత …
Read More »“విజయ దశమి” శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేసారు. నవరాత్రి వేడుక ధర్మం యొక్క ఔనత్యాన్ని వెల్లడిస్తుందని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా వేడుకలను జరుపుకుంటున్నామని వివరించారు. రాష్ట్ర ప్రజలందరికీ కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు అందించాలని వేడుకుంటున్నానన్నారు. కరోనా ప్రవర్తనా నియమావళిని పాటించటం ద్వారా పండుగ వేడుకలను జరుపుకోవాలని గవర్నర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ముఖ ముసుగు ధరించటంతో పాటు, సామాజిక దూరం …
Read More »రాష్ట్ర ప్రజలందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు… : మంత్రి కొడాలి నాని
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దసరా పండుగ ఒకటని, తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు, పదవ రోజు విజయదశమితో కలిపి దసరా పండుగను జరుపుకుంటారన్నారు. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపంలో హతుడయ్యాడని, మహిషుని సంహరించిన రోజును దసరా …
Read More »