Breaking News

టిటిడి నుంచి దుర్గామల్లేశ్వర స్వామివార్లకు మేల్ చాట్ పట్టువస్త్రాలు సమర్పణ…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టిటిడి ఇవో కె.ఎస్.జవహర్ రెడ్డి, అడిషనల్ ఇవో దర్మారెడ్డి వారి తరపున ప్రతినిధులుగా టిటిడి దేవస్థానం పేష్కార్ సూపరింటెండెంట్ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లకు మేల్ చాట్ పట్టువస్త్రాలను సమర్పించారు. టిటిడి నుంచి వచ్చిన ప్రతినిధులను ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వాహణాధికారి డి. భ్రమరాంబ ఆలయ మర్యాదలతో మేళతాళాల మధ్య టిటిడి పట్టువస్త్రాలను అమ్మవారి సన్నిదికి చేర్చి ప్రత్యేక పూజల అనంతరం స్వీకరించారు. ఆశీర్వాద మండపంలో టిటిడి ప్రతినిధులకు వేద పండితులు ఆశీర్వచనం పలుకగా ఆలయ ఇవో శేషవస్త్రాలను, ప్రసాదాలను అందచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *