Breaking News

Telangana

గాంధీజీ జీవితం ప్రతీఒక్కరికీ ఆదర్శనీయం… : ఆర్డీఓ రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అహింసే ఆయుధంగా దేశానికీ స్వాతంత్రం సాధించిన గాంధీజీ జీవితం ప్రతీఒక్కరికీ ఆదర్శనీయమని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతి, అహింస అనే రెండు ఆయుధాలతో గడగడలాడించిన మహాత్మా గాంధీజీ జీవితాన్ని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. గాంధీజీ జీవితం, ఆయన …

Read More »

ఆంధ్రప్రదేశ్ భవన్ లో ఘనంగా మహాత్మా గాంధీ 152వ జయంతి నిర్వహణ…

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ లోని ఆంధ్రప్రదేశ్ భవన్ లోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో నేడు మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏ.పీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) భావ్నా సక్సేనా మరియు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కె.యం సాహ్ని సంయుక్తంగా నిర్వహించారు. ముందుగా ఏ.పీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కె.యం సాహ్ని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి …

Read More »

గాంధీజీ ఆశయాల దిశగా అందరూ కృషి చేయాలి…

-పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భావితరానికి మహాత్ముని ఆశయాలు, లక్ష్యాలు, విలువలతో కూడుకున్న సిద్ధాంతాలను నేర్పించాలని, అది విద్యావ్యవస్థ ద్వారే సాధ్యమని పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ గారు అన్నారు. శనివారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ నయీ తాలీం ద్వారా ప్రతిపాదించిన ‘పని చేస్తూ విద్య నేర్చుకోవడం’ విధానాన్ని అనుసరించడం వల్ల విద్యార్థులు శ్రమశక్తిలో మమేకమై అనేక వృత్తి …

Read More »

గవర్నర్ ను కలిసిన సమీర్ శర్మ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ర్య గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాష్ర్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సమావేశం అయ్యారు. నూతనంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో సమీర్ శర్మ శనివారం గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. రాష్రంన్లో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలను గురించి సిఎస్ గవర్నర్ కు వివరించారు. సర్వీసు తొలి రోజులలో విజయవాడ నగర పురపాలక కమీషనర్ గా పనిచేసిన విషయాన్ని బిశ్వభూషణ్ హరిచందన్ …

Read More »

అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటిన మహాత్ముడు…

–ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ -రాజ్ భవన్ లో ఘనంగా గాంధీజీ, శాస్త్రిజీ జయంతి వేడుకలు -నేతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి, ఆవరణలో మొక్కలు నాటిని గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్ముని జీవితం ఆచరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కేవలం భారతీయులే కాక ప్రపంచవ్యాప్తంగా జాతి పిత మహాత్మా గాంధీ 152వ జయంతి, భారతదేశ ద్వితీయ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతిని జరుపుకుంటున్నారన్నారు. గాంధీ …

Read More »

డి‌జి‌పి కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ 152వ జయంతి నిర్వహణ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి లోని డి‌జి‌పి కార్యాలయంలో మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ IPS జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ DG L&O రవి శంకర్ అయ్యనార్ IPS తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Read More »

ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆదివారం ఉదయం నగరంలో నిర్వహించే సైక్లింగ్, వాకింగ్ కార్యక్రమాలను కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఏర్పాటు చేస్తున్నాం…

-కలెక్టరు జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పరిశుభ్రత, స్వచ్చ సర్వేక్షన్, సాలిడ్ వేస్ట్ మెనేజ్మెంట్ పై పలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని కలెక్టరు జె. నివాస్ తెలిపారు. నగరంలోని జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా చేపట్టనున్న కార్యక్రమాలకు సంబందించి పోస్టర్లను శనివారం కలెక్టరు జె. నివాస్, జాయింట్ కలెక్టర్లు కె. మాథవీలత, ఎల్. శివశంకర్, కె. మోహన్ కుమార్, సబ్ …

Read More »

భావితరాలు మహాత్మాగాంధి సేవలను ఆదర్శంగా తీసుకోవాలి…

-ఏఓ స్వామినాయుడు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుదం పట్టకుండా అహింసా మార్గంలో పోరాడి భానిష సంకెళ్ల నుండి భారతావనికి ముక్తిని ప్రసాదించిన మహనీయుడు పూజ్యబాపూజి మహాత్మాగాంధి అని ఆర్డీవో కార్యాలయపు పరిపాలనాధికారి స్వామినాయుడు అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శనివారం మహాత్మాగాంధి 152 వ జయంతి ని పురష్కరించుకొని ఏవో స్వామినాయుడు కార్యాలయ సిబ్బందితో కలసి మహాత్మాగాంధి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్డాడుతూ మహాత్మాగాంధి వంటి ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం …

Read More »

మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపైఉంది…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళుతూ వారి బాటలో నడవడమే ఆ మహాత్మునికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావుఅన్నారు.  మహాత్మాగాంధి 152 వ జయంతి ని పురష్కరించుకొని స్థానిక గాంధీబొమ్మ సెంటర్ లో శనివారం ఉదయం పట్టణ ప్రముఖులతో కలసి జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహనికి ఎమ్మెల్యే డిఎన్ఆర్ పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ భారతీయులందరికీ ప్రాతఃస్మరణీయుడన్నారు. …

Read More »

అహింసే ఆయుధంగా జీవితకాలం పోరాడిన మహనీయుడు మహాత్మా గాంధి…

-ఆ మహాత్ముని జయంతి రోజున స్మరించుకోవడం మన కర్యవ్యం… -ఎంపీపీ గద్దే పుష్పరాణి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : అహింసే ఆయుధంగా జీవితకాలం పోరాడి ఇతరులకు ఆదర్శంగా నిలిచిన మహనీయులు మహాత్మాగాంధి అని వారి ఆశయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాద్యత మనఅందరిపైనా ఉందని ఎంపీపీ గద్దే పుష్పరాణి అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మహాత్మాగాంధి, లాల్ బహుదార్ శాస్త్రి జయంతి వేడుకలను పురష్కరించుకొని శనివారం వారి చిత్రపటాలకు పూలదండలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మనిషిగా …

Read More »