జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక విగ్రహాలు నిమజ్జన సమయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను సూచించారు. శనివారం జగ్గయ్యపేట పట్టణంలోని వారి స్వగృహంలో పోలీసు, రెవిన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయివేటు స్థలాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను నవరాత్రి ఉత్సవాల అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమర్జనాలు చేసుకోవాలని కోరారు. జగ్గయ్యపేట మండలంలోని …
Read More »Telangana
నేడు మెగా కోవిడ్ వాక్సినేషన్ డ్రైవ్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని సచివాలయల ద్వారా ఈ నెల 12న ఆదివారం నాడు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల లోపు వారికి కోవిడ్ టీకాలు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ దృష్ట్యా 18 నుంచి 44 సంవత్సరాల లోపు వయస్సు గలవారు తమ సమీప సచివాలయంలో కోవిడ్ టీకాలు పొందేందుకు ఆదివారం ఏర్పాటు చేసే మెగా కోవిడ్ వాక్సినేషన్ డ్రైవ్ లో కోవిడ్ టీకాలు …
Read More »ఎస్సీల అభివృద్ధి భాజపాతోనే సాధ్యం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీల అభివృద్ధికి తోడ్పడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే నని భాజపా ఎస్సీమోర్చా జాతీయ కార్యవర్గసభ్యులు, రాష్ట్ర ఇన్ఛార్జి సుశాంత్ కుమార్ మాలిక్ పేర్కొన్నారు. భాజపా ఎస్సీ సెల్ సమావేశం భాజపా రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సుశాంత్ కుమార్ మాలిక్ మాట్లాడుతూ, స్వాతంత్య్రానంతరం 70ఏళ్లలోపు ఏ పార్టీ కూడా ఎస్సీల ఉన్నతికి కృషి చేయలేదని, భాజపా మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. జన్ ధన్, ముద్ర, ఉజ్వల్, స్టాండప్, పిఎంఆవాస్ యోజన, వంటి పథకాల్లో …
Read More »అంగన్ వాడి కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా తీర్చిదిద్దుతున్నాం… : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్ వాడి కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా తీర్చిదిద్దుతున్నట్లు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు మండలం అన్నవరం గ్రామం లో 22.40 లక్షల రూపాయలతో నిర్మించిన రెండు అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడం తో పాటు పిల్లలకు ప్రీ స్కూల్ …
Read More »వాతావరణ సూచన…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతం. ఈ ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం. తదుపరి 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం. దీని ప్రభావంతో రాగల 4 రోజులు పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం. పశ్చిమ బెంగాల్ , …
Read More »గణనాథుని ఆశీస్సులు ప్రభుత్వంపై ఎల్లవేళలా ఉండాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-చవితి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి వేడుకలను సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు కోవిద్ నిబంధనలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అయోధ్య నగర్ లోని నవభారత్ అపార్ట్ మెంట్ లో శనివారం జరిగిన వేడుకలలో శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ మంచి కార్యం చేపట్టాలన్నా.. తొలి పూజ విఘ్ననాథునితోనే మొదలవుతుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. కులాల, మతాలకతీతంగా భక్తులు కొలిచే …
Read More »అర్హులైన ట్రాన్సజెండర్స్ అందరికీ సంక్షేమ పధకాలు అందిస్తాం : జిల్లా కలెక్టర్ జె. నివాస్
-కుటీర పరిశ్రమల ఏర్పాటుతో గౌరవంగా జీవించేలా చేస్తాం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అర్హులైన ప్రతీ ట్రాన్సజెండర్ కి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వివిధ సమస్యలతో తనను కలిసేందుకు వచ్చిన ట్రాన్సజెండర్స్ ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ట్రాన్సజెండర్స్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019లో ప్రత్యేక చట్టాన్ని …
Read More »రైతుల ఉత్పత్తి సంస్థను సందర్శించిన జిల్లా కలెక్టర్
-ఎఫ్ పీవో ల ద్వారా రైతులకు బహుళ ప్రయోజనలు… విజయవాడ/తోట్లవల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : తోట్లవల్లూరు మండలం,చాగంటిపాడు గ్రామంలో ని శ్రీ విఘ్నేశ్వర రైతుల ఉత్పత్తి సంస్థ (ఎఫ్ పిఓ) ను జిల్లా కలెక్టర్ జె. నివాస్ సందర్శించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎఫ్ పీవో లు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తిదారులకు మెరుగైన ఆదాయాన్ని అందించడమే రైతుల ఆధ్వర్యంలోని రైతుల ఉత్పత్తిదారుల సంస్థల ప్రధాన లక్ష్యమన్నారు. ఈ దిశగా పనిచేస్తు డాక్టర్ వైయస్ఆర్ లైఫ్ టైం ఏచివ్ మెంట్ అవార్డు …
Read More »ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడం జరుగుతోంది…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడం జరుగుతోందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం కొవ్వూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవ, శంఖుస్థాపన కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ఐ.పంగిడి గ్రామంలో రూ. 21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ను, రూ.198 లక్షలతో నిర్మించిన ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ప్రారంభించారు. దేచేర్ల …
Read More »నగరంలోని సీతమ్మ పాదాల వద్ద నదీ ప్రాంతంలో గణేష్ విగ్రహాల విమజ్జన ఏర్పాట్లను పూర్తి చేశాం…
-గణేష్ విగ్రహాల నిమజ్జనంలో పాల్గొనే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలి… -ఐదు మందికి మించి నిమజ్జనంలో పాల్గొనరాదు… -కృష్ణానదిలో వరద నీరు ఎక్కువుగా ఉండటంతో భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలి… -కలెక్టరు జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం కొరకు కృష్ణాబ్యారేజ్ దిగువన గల సీతమ్మ పాదాల వద్ద గల నదీ పరివాహక ప్రాంతంలో విగ్రహాల నిమజ్జన కొరకు ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టరు జె. నివాస్ తెలిపారు. నగరంలో గణేష్ ఉత్సవాలు అనంతరం …
Read More »