-నీపా ఆచార్యులు స్మితా మాలిక్ -ప్రారంభమైన లీడర్ షిప్ విభాగం సదరన్ రీజియన్ లెవెల్ వర్క్ షాప్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రస్థాయిలో పాఠశాల నాయకత్వ విభాగాలని అభివృద్ధి చేయాలని, తద్వారా పాఠశాల నాయకత్వం ఆచరణలో మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల అభ్యసన ఫలితాలని మెరుగుపరచాలని జాతీయ విద్య పరిపాలన నిర్వహణ సంస్థ (NIEPA) ఆచార్యులు డాక్టర్ చారుస్మిత మాలిక్ తెలిపారు. సమగ్ర శిక్ష, సీమ్యాట్ పాఠశాల నాయకత్వ విభాగం (స్కూల్ లీడర్ షిప్ విభాగం) , జాతీయ పరిపాలనా నిర్వహణా సంస్థ …
Read More »Telangana
సీబీఎస్ఈ పాఠ్యప్రణాళిక మాడ్యూళ్లు ఆవిష్కరణ
-రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 1000 ప్రభుత్వ పాఠశాలలల్లో సీబీఎస్ఈ అమలు అవుతుందని రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో సీబీఎస్ఈ పదో తరగతి పాఠ్య ప్రణాళిక మాడ్యూళ్లు (కరదీపికలు) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం రూపొందించిన పాఠ్యప్రణాళికలు కలిగి ఉంటే బోధనలో నూతనత్వం సంతరించుకుంటుందన్నారు. ఈ పాఠ్య ప్రణాళికలు 2020 నాటి జాతీయ విద్యా విధానం (NEP)ని సమర్థవంతంగా …
Read More »పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి
-విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు -విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ -పదో తరగతి, ఇంటర్మీడియెట్, టెట్, డీఎస్సీ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖామాత్యుల సమీక్ష -పరీక్షా కేంద్రాలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకూడదు. -జిల్లా కలెక్టర్లు, ఇతర విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల నిర్వహణకు అధికారులంతా అప్రమత్తమై పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ అన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఏపీ టెట్, డీఎస్సీ …
Read More »4వ మరియు 5వ ఉమ్మడి కాన్వొకేషన్ వేడుకలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : IIT తిరుపతి 4వ మరియు 5వ ఉమ్మడి కాన్వొకేషన్ వేడుకలను 22 ఫిబ్రవరి 2024న నిర్వహించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి తన 4వ మరియు 5వ ఉమ్మడి స్నాతకోత్సవ వేడుకలను 22 ఫిబ్రవరి 2024న ఏర్పేడులోని శాశ్వత క్యాంపస్‌లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మేంద్ర ప్రధాన్, విద్యా మంత్రి; స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షత సజ్జన్ జిందాల్, JSW గ్రూప్ …
Read More »ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు 272 వేతనం
-జిల్లా కలెక్టర్ డాక్టర్ : జి. లక్ష్మిశ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ. 272 వేతనం అందేలా పనులు చేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. జి. లక్ష్మిశ పేర్కొన్నారు. గురువారం డ్వామా పిడి. శ్రీనివాస్ ప్రసాద్ తో కలిసి రేణిగుంట మండలం, విప్పమానుపట్టేడ పంచాయతీ కి చెందిన సూరప్ప కసం నందు జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కూలీలకు రోజు …
Read More »రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సహకారంతో ఆంధ్ర హాస్పిటల్స్‌లో ఉచిత పిల్లల గుండె ఆపరేషన్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సహకారంతో ఆంధ్ర హాస్పిటల్స్‌లో రూ.65,22,873ల వ్యయముతో నిరుపేద పిల్లలకు 76 గుండె శస్త్రచికిత్సలు నిర్వహించుచున్నది. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్, ఆసుపత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పి.వి.రామారావు మాట్లాడుతూ గత 8 సం. నుంచి ఆంధ్ర హాస్పిటల్స్‌లో 4000 వరకు పిల్లల గుండె సర్జరీలు మరియు ఇంటర్వెన్షన్స్ చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుండి ఇక్కడికి రావటం, అతి క్లిష్టమైన గుండె జబ్బులకి కూడా ఆపరేషన్లు …
Read More »సూక్ష్మ ప్రణాళికల అమలుతో పోలింగ్ నమోదు శాతాన్ని పెంచండి
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ నమోదు శాతాన్ని విస్తృత స్థాయిలో పెంచే లక్ష్యంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్వీప్ సూక్ష్మ ప్రణాళికలను అమలు పర్చాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా జిల్లాల స్వీప్ నోడల్ అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృంధం రాష్ట్రానికి వచ్చిన సందర్బంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో వెలగపూడిలోని …
Read More »రానున్న ఎన్నికల్లో 83% పైగా పోలింగ్ నమోదు లక్ష్యం
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83 శాతం పైగా పోలింగ్ నమోదు లక్ష్యంగా ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరుస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో అమలు చేయబడుచున్న క్రమబద్దమైన ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను (SVEEP – Systematic Voters’ Education & Electoral Participation) సమీక్షించేందుకు భారత …
Read More »మున్సిపల్ సెక్టార్లో ఇంధన సామర్ధ్య అవగాహనను ప్రోత్సహిస్తున్న ఏపీఎస్ఈసిఎం
-21 ఫిబ్రవరి-2024న విజయవాడలో మున్సిపల్ పంప్ ఆపరేటర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం -పురపాలక సంస్థలలో ఇంధన సామర్థ్య చర్యలను ప్రోత్సహించే లక్ష్యంగా శిక్షణ కార్యక్రమం. -పురపాలక శాఖలో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడమే మున్సిపల్ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ లక్ష్యం -15 మున్సిపల్ కార్పొరేషన్లలో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన ఏపీఎస్ఈసిఎం -ఎనర్జీ ఆడిట్ ద్వారా 25 MU విద్యుత్ పొదుపు కు అవకాశం ఉన్నట్లు అంచనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపల్ రంగంలో ఇంధన పొదుపు మరియు ఇంధన సామర్థ్యంపై …
Read More »వన్ స్టాప్ సెంటర్ ఇంటర్వూ లకి హాజరైన 87 మంది అభ్యర్ధులు
-కలక్టర్ మాధవీలత -డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ప్రత్యుష కుమారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం వన్ స్టాప్ సెంటర్ నందు ఎనిమిది కేటగిరిలలో 13 పోస్టుల భర్తీ కి ఇంటర్వ్యూ లని నిర్వహించటం జరిగినదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. బుధవారం స్ధానిక కలక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో వన్ స్టాప్ సెంటర్ కమిటి సభ్యులతో ఇంటర్వ్యు లని నిర్వహించటం జరిగింది. జిల్లా కలెక్టర్ మాధవీలత, డీ ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె. …
Read More »