Breaking News

Daily Archives: May 22, 2024

ఏపీలో మరొక్క ఐదు నూతనంగా మెడికల్‌ కాలేజీలు !

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024–25 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వైద్య కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదన­పల్లెలో కొత్తగా వైద్య కళాశాలలను ప్రారంభించి ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా రాబట్టేలా వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) త్వరలో ఐదు చోట్ల అతి త్వరలో ఇన్‌స్పెక్షన్‌ …

Read More »

మే 23 బుద్ధ పూర్ణిమ… బుద్ధుడు చెప్పింది విందాం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మే 23 బుద్ధ పూర్ణిమ… భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ కు బుద్ధుడు బోధనలు స్ఫూర్తిగా నిలిచాయి. అహింస ద్వారానే ఏదైనా సాధించగలమని బుద్ధుడు పలుమార్లు చెప్పారు. గౌతమ బుద్ధుడు 29 సంవత్సరాల వయస్సులో సన్యాసం తీసుకున్నారు 6 సంవత్సరాల పాటు ఆయన కుటుంబానికి దూరంగా ఉన్నారు. ఆయన ఆచరించిన సత్యం, అహింస, ధర్మం, దయ కోసం ప్రజలను ప్రేరేపించారు. ఆ మార్గాన్ని అనుసరించడానికి బౌద్ధమతాన్ని స్థాపించారు. బౌద్ధమతాన్ని స్కీకరించిన ప్రజలు తెల్లని …

Read More »

విజయ కీలాద్రి దివ్య క్షేత్రంపై శ్రీ నృసింహ జయంతి వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో బుధవారం విజయ కీలాద్రి దివ్య క్షేత్రంపై శ్రీ నృసింహ జయంతి వేడుకలు ఎంత వైభవంగా జరిగాయి. సాయంత్రం 6 గంటలకు అభిషేకం మహోత్సవం, అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణ మహోత్సవం, అష్టోత్తర శతనామార్చన, మంగళ శాసనం, తీర్థ ప్రసాద గోష్టి తో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది.

Read More »

పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్ధులకు పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫార్మ్ లు అందించాలి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జూన్ 12న పాఠశాలలు తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలు,నోటు పుస్తకాలతో పాటు,ఏకరూప దుస్తులు,బ్యాగులు వంటివన్నీవిద్యార్ధులకు అందే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.2024-25 విద్యా సంవత్సర సన్నాహక ఏర్పాట్లపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ తీసుకుంటున్న సన్నాహక చర్యలను సమీక్షిస్తూ విద్యార్ధులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు,నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు,బ్యాగులు,బూట్లు …

Read More »

ఆర్కెవివై,కృషోన్నతి యోజన పధకాల అమలుపై రాష్ట్ర స్థాయి సాంక్షనింగ్ కమిటీ సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు కృషోన్నతి యోజన కింద వ్యవసాయ,అనుబంధ రంకాల్లోని పధకాలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి అమలు చేసేందుకు సంబంధించి కన్సాలిడేటెడ్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక-2024-25 అమలుపై రాష్ట్ర స్థాయి సాంక్షనింగ్ కమిటీ సమావేశం బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.రాష్ట్రీయ కృషి వికాసయోజన, కృషోన్నతి యోజన కింద 2024-25లో వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 1193 కోట్ల రూపాయల కేంద్ర,రాష్ట్రాల ప్రభుత్వాల …

Read More »

కిర్గిజ్‌స్థాన్‌లో పరిస్థితి ప్రస్తుతం సాధారణంగానే ఉంది…

-మే 23 నుండి ప్రతిరోజూ బిష్కెక్ నుండి న్యూఢిల్లీకి నేరుగా 02 విమానాలు -APNRTS కు తెలిపిన చరణ్‌జీత్ సింగ్, అదనపు కార్యదర్శి, యురేషియా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కిర్గిజ్‌స్థాన్‌లో పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎన్ఆర్టీ సొసైటీ నిరంతరం పర్యవేక్షిస్తోంది. మన తెలుగు విద్యార్థులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, వారికి కౌన్సెలింగ్ ఇస్తోంది. ఏపీఎన్ఆర్టీఎస్, అందుబాటులో ఉన్న సమాచారాన్ని మరియు విదేశాంగ శాఖ (MEA) ఇస్తున్న సలహాలను, సకాలంలో విద్యార్థులకు తెలుపుతోంది. తమ …

Read More »

డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి బెంజ్‌ సర్కిల్‌ నుండి ఆటోనగర్‌ మార్గంలో డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు జాతీయ రహదారులు నేషనల్‌ హైవే అథారిటీ అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్‌లో ఎన్‌హెచ్‌ఎఐ, నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆయన ఛాంబర్‌లో జాతీయ రహదారి డ్రైనేజీ సమస్య పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 65లో …

Read More »

ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల బాలుర వసతి గృహము ప్రవేశము కొరకు ప్రకటన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతులైన అనగా శారీరక, బధిర, ధృష్టి లోపం కలిగి, 3వ తరగతి నుండి పి.జి. వరకు చదువుచున్న వారికి ఎల్.బి.ఎస్. నగర్, పాయకాపురం, విజయవాడ నందు ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల బాలుర వసతి గృహము నడుపబడుచున్నది. ఒకసారి 3వ తరగతి నందు ప్రవేశము పొందిన వారు, వారి వసతికై వేరు వేరు ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు వారి చదువు కొనసాగించుకోవచ్చు. ఈ వసతి గృహములో విద్యార్ధులకు దుస్తులు, భోజనం మరియు …

Read More »

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు రోడ్డు అప్సర థియేటర్ సమీపంలో ఫర్నిచర్ డీలక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని బుధవారం రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. రోజురోజుకి వేసవి తాపం పెరిగిపోతుండటంతో అధిక ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ మజ్జిగ చలివేంద్రంను ఏర్పాటు చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. స్థానికులతోపాటు నగరానికి ఇతర ప్రాంతాల నుండి రాకపోకలు సాగించే ప్రయాణీకుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో …

Read More »

ఈవిఎం స్ట్రాంగ్ రూం లను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోల్డ్ ఈవిఎం లు భద్రపరచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బుధవారం రాత్రి సదరు స్ట్రాంగ్ రూం ను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడుతూ స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లు 24X7 అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూం నందు ఈవిఎం …

Read More »