Breaking News

Daily Archives: May 21, 2024

త్వరలో భారత్‌లో ఎయిర్ టాక్సీ సేవలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏవియేషన్ స్టార్టప్ జాబీ ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ టాక్సీని ప్రారంభించబోతోంది. కంపెనీ 2025 నాటికి దుబాయ్‌లో ఫ్లయింగ్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించనుంది. మరోవైపు ఇంట్‌గ్లోబ్ ఏవియేషన్స్, ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా దేశంలో ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభిస్తున్నాయి. ఢిల్లీలో ఎయిర్ టాక్సీ సర్వీస్ 2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముంబై, బెంగళూరులో కూడా ప్రారంభించే యోచనలో ఉంది.

Read More »

ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నందమూరి రామకృష్ణ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : నందమూరి తారకరామారావు కుమారులు నందమూరి రామకృష్ణ విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు. విభజన అనంతరం ఎంతో కష్టబడి పునాదుల నుండి నిర్మించుకుంటున్న రాష్ట్రాన్ని జగన్ రెడ్డి గెలిచాక సర్వ నాశనం చేశాడని అన్నారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ బాటలో పరుగులు పెడుతుందన్నారు. జూన్ 4 తర్వాత మళ్లీ దర్శించుకుంటానని తెలిపారు. నందమూరి రామకృష్ణతో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట …

Read More »

గ్రామ స్థాయిలో కేన్స‌ర్ స్క్రీనింగ్ కు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌

-ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ డాక్ట‌ర్ య‌స్‌.వెంక‌టేశ్వ‌ర్‌ విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ స్థాయిలో కేన్స‌ర్ స్క్రీనింగ్‌కు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేస్తోంద‌ని, ఈ క్ర‌మంలోనే రాష్ట్ర స్థాయిలో శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని రూపొందించామ‌ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ డాక్ట‌ర్ ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్ అన్నారు. అగ‌నంపూడిలోని హోమీ బాబా కేన్స‌ర్ హాస్పిట‌ల్ మ‌రియు రీసెర్చ్ సెంట‌ర్ లో మంగ‌ళ‌వారం నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ప్రివెంటివ్ అంకాలజీపై క‌మ్యూనిటీ హెల్త్ మెడిసిన్, గైన‌కాల‌జీ, ఇఎన్‌టి, …

Read More »

ఉపాధిహామీ,స్వచ్ఛభారత్ అనుసంధానంతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేయాలి

-ఇసి అనుమతితో ఉపాధి హామీ పనులను పెద్దఎత్తున చేపట్టండి -ఉపాధి హామీ పనుల్లో వాటర్ కన్జర్వేషన్ పనులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి -తాగునీరు,విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తితే తక్షణం పరిష్కరించండి -సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉపాధిహామీ,స్వచ్చ భారత మిషన్ అనుసంధానంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పెద్దఎత్తున చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలక్టర్లను ఆదేశించారు.తాగునీరు,ఉపాధి హామీ పనులు,విద్యుత్ సరఫరా పరిస్థితులపై మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో …

Read More »

తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల గృహ సందర్శన కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉండాలి

-విద్యార్థుల హాజరు, ప్రవర్తన, అభ్యాసంలో మెరుగుదలకు దోహదపడనున్న గృహ సందర్శన కార్యక్రమం -పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల గృహ సందర్శన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల మధ్య నేర్చుకునే అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా 2 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, లెక్చరర్లను ఉద్దేశించి …

Read More »

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డి జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామి పథకంలో పని కోరిన ప్రతీ కూలీకి ఉపాధి కల్పిస్తున్నామని, జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డికి వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డి మంగళవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యుత్‌ త్రాగునీటి సరఫరా తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్‌ …

Read More »

ఇంటర్మీడియట్, పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 24వ తేదీ నుండి జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ, పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రకడ్బందీగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో మంగళవారం డి ఆర్ వో వి. శ్రీనివాసరావు ఇంటర్మీడియట్, పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 24వ తేదీ నుండి …

Read More »

స్ట్రాంగ్ రూంల వ‌ద్ద భ‌ద్ర‌త ను పరిశీలించిన జిల్లాకలెక్టర్ ఎస్. ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ఏడు నియోజక వర్గాలకు చెందిన ఈవీఎంలు భ‌ద్ర‌ప‌రిచిన స్ట్రాంగ్ రూంల వ‌ద్ద భ‌ద్ర‌తను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీ రావు సోమవారం పరిశీలించారు. ఇబ్రహీంపట్నం లోని నోవా, నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం ల భద్రత పై అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు. ఈవీఎం లకు కేంద్ర, రాష్ట్ర, సివిల్ పోలీసులతో ప్రభుత్వం మూడు అంచెల భద్రత కల్పించిందన్నారు. స్ట్రాంగ్ రూములకు …

Read More »

పోల్డ్ ఈవిఎం స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ తో కలిసి పరిశీలించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోల్డ్ ఈవిఎం లు భద్రపరచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించి, మీడియా సెంటర్, పార్కింగ్ ఏర్పాట్ల కొరకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మంగళవారం సదరు స్ట్రాంగ్ రూంల భద్రత పరిశీలించి, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్ల పై, మీడియా కేంద్రం, …

Read More »

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో స్ట్రాంగ్ రూములకు మూడంచెల పటిష్టమైన భద్రత కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో త్రాగునీరు, విద్యుత్ సరఫరా పరిస్థితి, ఉపాధి హామీ, శాంతిభద్రతలు అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ విసీ హాల్ నుండి సి ఎస్ వీసీలో పాల్గొన్నారు. జిల్లాలో తాగునీటి, విద్యుత్ సరఫరా పరిస్థితి …

Read More »