Breaking News

Daily Archives: May 23, 2024

ఏపిపిఎస్సి పరీక్షలు- అభ్యర్థులను అనుమతించే సమయాలు ఉదయం 7.30 నుండి 8.30 వరకు…

-మే 25 వ తేదీ కోసం ఏర్పాట్లు పూర్తి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపిపిఎస్సి పరీక్షల కోసం జిల్లాలో 960 మంది అభ్యర్థులు హజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ కె మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 25 శనివారము ఎపిపి ఎస్సి పరీక్షల కోసం విద్యార్థులను అనుమతించే సమయాలు ఉదయం 7.30 నుండి 8.30 వరకు అని పేర్కొన్నారు. సమర్థవంతంగా పరీక్షల నిర్వహణ కోసం సమన్వయ శాఖల అధికారులతో 24.05.2024 శుక్రవారం ఉదయం సమన్వయ సమావేశానికి …

Read More »

కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ పరిశీలన

-కమాండ్ కంట్రోల్ కేంద్రం లో సీసీ టీవీ ల ఏర్పాట్లు -ఎస్పీ తో కలిసి కలెక్టర్ మీడియా విభాగం పరిశీలన రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్పీ తో కలిసి కౌంటింగ్ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ రూం, మీడియా విభాగం వద్ద నిర్వహించే భద్రత తదితర ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. గురువారం సాయంత్రం స్థానిక నన్నయ్య యూనివర్సిటీ ఆరణనలో చేస్తున్న భద్రత విషయంలో రాజమండ్రీ రూరల్, అర్బన్, రాజానగరం, కొవ్వూరు, …

Read More »

మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు జీతభత్యాలు 010 పద్దు కింద చెల్లించాలి…. : ఏపిఎంఎస్టిఎఫ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు జీతభత్యాలు 010 హెడ్ కింద చెల్లించాలని, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సక్రమంగా అమలు జరగాలంటే ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ పరిధిలోనికి తేవాలని మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ కన్వీనర్ పి. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. విజయవాడ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో  గురువారం జరిగిన వర్కుషాపులో విద్యాశాఖ జారీ చేసిన సర్వీసు ప్రతిపాదనలపై ఒక వర్కు షాపు నిర్వహించి ప్రతిపాదనలో చేపట్టవలసిన మార్పుల గురించి చర్చించినట్లు ఏపీఎంఎస్ టిఎఫ్ కో-కన్వీనర్ ఎస్. బాలాజీ తెలియజేశారు. …

Read More »

ప్రతి విద్యార్థి మధ్యాహ్న భోజనం తినేలా చూడాలి

-తిరుపతిలోని తాజ్ హోటల్ వంట నిపుణుల సహకారంతో ప్రత్యేక వీడియోల రూపకల్పన -మధ్యాహ్న భోజన పథకం మెనూలోని వివిధ వంటకాల తయారీపై శిక్షణా వీడియోలు -వీడియోలో రుచికర, ఆరోగ్యకరమైన వంటకాల తయారీ, తద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల వివరణ -రాష్ట్రంలోని 44,190 పాఠశాలల్లో అందించే ఆహారం నాణ్యత, రుచిని నిర్ధారించడమే లక్ష్యం -100 శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినేటట్లు ప్రోత్సహించాల్సిందిగా డీఈవోలకు ఆదేశం -కలిసి భోజనం చేయడం, ఆడుకోవడం ద్వారా విద్యార్థుల్లో టీమ్ స్పిరిట్, సహచర్యం పెరుగుతాయన్న నమ్మకం -“తల్లిదండ్రుల- ఉపాధ్యాయుల గృహసందర్శన”లో …

Read More »

కౌంటింగ్ ప్రారంభమానికి ముందు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ఫలితాలు వెల్లడించే సమయంలో పార్టీ ఏజెంట్లు గమనించవలసిన అతి ముఖ్యమైన అంశాలు!! 1) ఫారం 17సీ మీ దగ్గర వుంచుకోవాలి. ఎన్నికల అయిన తేదీ నాడే ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్లతో సంతకం చేసినదే మీరు తీసుకోవాలి. ఈ ఫారం 17సీ ఏజెంట్లు సంతకాలు లేనిదైతే ఏదో అవకతవకలు జరిగినట్లు భావించాలి. 2) ప్రతి పోలింగ్ కేంద్రం (Polling Station) ఫారం 17సీ లో వున్న కంట్రోల్ యూనిట్ (C.U No) నెంబరు, మిషన్ పైన వున్న …

Read More »

చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు సడలించాలి…  : గజ్జల వెంకటలక్ష్మి  

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు సడలించాలని  మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. ఏలూరు జిల్లా  కైకలూరులో తరగతి గదిలో విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం  ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి  ఫోక్సో చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. మైనర్ బాలికకు మెరుగైన వైద్యం, షెల్టర్ హోమ్ ద్వారా రక్షణ కల్పించాలని జిల్లా అధికారులకు సూచనచేసారు. అండగా ఉంటామని బాధితురాలి తల్లికి గజ్జల వెంకటలక్ష్మి …

Read More »

ఏపీ లో జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున ర్యాలీలు, ఊరే గింపులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. అలాగే బాణసంచా విక్రయంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. టపాసులు విక్రయించినా, కాల్చినా బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More »

పాఠశాలల్లో లిప్ (లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రొగ్రాం) కార్యక్రమం సక్రమంగా అమలు చేయాలి

-సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి  విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించడానికి మోనటరింగ్ వ్యవస్థ పటిష్టం కావాలని, సక్రమమైన కార్యాచరణ ప్రణాళిక వేయాలని సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి అన్నారు. గురువారం విజయవాడలోని ఆంధ్రా లయోల కాలేజీ ప్రాంగణం ఎస్ జె సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ లో జరుగుతున్న అభ్యసనా అభివృద్ధి కార్యక్రమం (ఎల్ఐపి) వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 6, 7, 8 తరగతుల విద్యార్థుల్లో సామర్థ్యాల సాధనకు, ఉపాధ్యాయులకు బోధనా …

Read More »

కౌంటింగ్‌ సిబ్బంది తొలి ర్యాండమైజేషన్‌ పూర్తి…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలలో భాగంగా ఓట్ల లెక్కింపుకు సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌, ఎస్‌. డిల్లీరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ ఛాంబర్‌లో జూన్‌ 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపుకు కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు ర్యాండమైజేషన్‌ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ డిల్లీరావు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు …

Read More »

మాతా, శిశు మరణాల పూర్తిస్థాయి నియంత్రణపై దృష్టిపెట్టండి…

-గత మరణాల సమగ్ర విశ్లేషణతో ప్రణాళికలు రూపొందించి, అమలుచేయండి… -వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మాతా, శిశు మరణాలు సంభవించకుండా కృషిచేయాలని, అదేవిధంగా గత మరణాలను సమగ్రంగా విశ్లేషించి పూర్తిస్థాయిలో నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికను అమలుచేయాలని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్‌ డిల్లీరావు జిల్లాలో చోటుచేసుకున్న మాతా, శిశుమరణాలపై వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష …

Read More »