Breaking News

కౌంటింగ్‌ సిబ్బంది తొలి ర్యాండమైజేషన్‌ పూర్తి…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలలో భాగంగా ఓట్ల లెక్కింపుకు సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌, ఎస్‌. డిల్లీరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ ఛాంబర్‌లో జూన్‌ 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపుకు కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు ర్యాండమైజేషన్‌ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ డిల్లీరావు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియకు 403 మంది కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, 504 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, 364 మంది మైక్రో అబ్జర్వర్లు మొత్తంగా 1271 మంది కౌంటింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ను పారదర్శకంగా ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ ఆన్‌లైన్‌లో పూర్తిచేశామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు.

ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో జాయింట్‌ కలెక్టర్‌, మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి డా. పి. సంపత్‌ కుమార్‌, డిఆర్‌వో వి. శ్రీనివాసరావు, ఎన్‌ఐసి డిఐఓ రేవతి, కలెక్టరేట్‌ ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ యం. దుర్గా ప్రసాద్‌, ఇ`డిస్టిక్ట్‌ మేనేజర్‌ సిహెచ్‌. గోపి సుధాకర్‌ ఉన్నారు.

Check Also

ప్రత్యేక హెూదా కోసం పవన్ కల్యాణ్ పోరాడాలి… : నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి ప్రత్యేక హెూదాతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ఒప్పించేందుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *