-మే 25 వ తేదీ కోసం ఏర్పాట్లు పూర్తి
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపిపిఎస్సి పరీక్షల కోసం జిల్లాలో 960 మంది అభ్యర్థులు హజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ కె మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 25 శనివారము ఎపిపి ఎస్సి పరీక్షల కోసం విద్యార్థులను అనుమతించే సమయాలు ఉదయం 7.30 నుండి 8.30 వరకు అని పేర్కొన్నారు. సమర్థవంతంగా పరీక్షల నిర్వహణ కోసం సమన్వయ శాఖల అధికారులతో 24.05.2024 శుక్రవారం ఉదయం సమన్వయ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి ఆద్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ION డిజిటల్ జోన్ లూథర్‌గిరిలో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష సమయాలు ఉదయం 9 నుండి 11.30 వరకు నిర్వహిస్తున్నట్లు ఈ పరీక్షల కోసం జిల్లాకు చెందిన మొత్తం అభ్యర్థులు 960 హాజరుకానున్న తెలిపారు. ఉదయం 7.30 నుంచి ఉ 8.30 వరకు అభ్యర్ధులను పరీక్షా కేంద్రాల లోకి అనుమతించడం జరుగుతుందనీ తెలిపారు.
Prajavartha Online Telugu News