విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పారిశుధ్య కార్యక్రమాలలో భాగంగా డివిజన్లోని పలు ప్రాంతాలలో కార్పొరేషన్ సిబ్బంది ‘సిల్ట్’ తొలగింపు కార్యక్రమం చేపట్టింది. శుక్రవారం బావాజీపేట, రామకోటి మైదానం తదితర ప్రాంతాలలో సైడు మురుగులు కాలువలోని ‘సిల్ట్’ తొలగింపు కార్యక్రమాన్ని హెల్త్ ఆఫీసర్ రామకోటేశ్వరరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యాన్ని ఇబ్బంది కలిగిదంటే దానికి కారణం దోమలు అని చెప్పవచ్చన్నారు. అటువంటి పరిస్థితిని నివారించాలంటే సైడు మురుగు కాలువలలో నీరు నిల్వ వుండకూడదు అప్పుడే దోమలను నివారించవచ్చు. అంతేకాకుండా మురుగు కాలువలు దుర్వాసన కూడా ఆరోగ్య ఇబ్బందులు కలగవచ్చు. వీటన్నింటిని దృష్టిలో వుంచుకుని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు చెత్తను తొలగించడం, మురుగు కాలువలు సిల్ట్, చెత్తను తొలగించడం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చేస్తూ ఆరోగ్యాంధ్రప్రదేశ్ నగరాన్ని తీర్చిదిద్ది మోడల్ డివిజన్ తీర్చదిద్దడానికి డివిజన్ కార్పొరేటర్, ప్రజల సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి చెత్తను డస్ట్‌బిన్‌లో వేయాలని, కాలువలలో ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్ వేయవద్దని సూచిస్తున్నామన్నారు. దీని ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ మేస్త్రీ ఎల్లారావు (లీడ్ వర్కర్), శానిటేషన్ సెక్రటరీ పావనీ, కార్పొరేషన్ అధికారులు, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News