తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
భారత సమాచార మరియు ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు దంపతులు తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం ప్రాతః కాల సమయంలో అభిషేక సేవలో పాల్గొని సేవించి దర్శించుకున్నారు. అంతకు మునుపు నిన్నటి దినం గురువారం సదరు భారత కార్యదర్శి తమ శాఖకు చెందిన ఆల్ ఇండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, దూరదర్శన్ ఉన్నత స్థాయి అధికారులతో తిరుపతి నందు సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వీరి వెంట లైజన్ అధికారి బాల కొండయ్య సంబంధిత అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News