Breaking News

కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ పరిశీలన

-కమాండ్ కంట్రోల్ కేంద్రం లో సీసీ టీవీ ల ఏర్పాట్లు
-ఎస్పీ తో కలిసి కలెక్టర్ మీడియా విభాగం పరిశీలన

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్పీ తో కలిసి కౌంటింగ్ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ రూం, మీడియా విభాగం వద్ద నిర్వహించే భద్రత తదితర ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు.

గురువారం సాయంత్రం స్థానిక నన్నయ్య యూనివర్సిటీ ఆరణనలో చేస్తున్న భద్రత విషయంలో రాజమండ్రీ రూరల్, అర్బన్, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, అనపర్తి స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాలలో, కమాండ్ కంట్రోల్ కేంద్రం, మీడియా విభాగం , పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రాలలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి, నోడల్ అధికారులకు సూచనలు చేసి, అక్కడ రిజిస్టర్ లలో సంతకాలు చెయ్యడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, నిఘా వ్యవస్థ ద్వారా ఎంట్రీ & ఎగ్జిట్ గేట్‌లు మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాలను కవర్ చేయడం జరుగుతోందనీ , కమాండ్ కంట్రోల్ రూం ద్వారా వాటినీ పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్ధులు, వారీ ఏజెంట్స్ కూడా కమాండ్ కంట్రోల్ రూం లో ఏర్పాటు చేసిన సిసి టీవీ కెమెరాల ద్వారా j
కదలికలు తెలుసుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మరియు చుట్టుపక్కల పోలీసు విభాగానికి చెందిన 7 సోలార్ CC కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.
కౌంటింగ్ కేంద్రంలో కంట్రోల్ రూమ్ జిల్లా కలెక్టర్ మరియు పోలీసు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో 24/7 పని చేస్తుందన్నారు. తహశీల్దార్ మరియు పోలీసు అధికారులు ఆధ్వర్యంలో నేరుగా స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాట్లు ప్రత్యక్షంగా పరిశీలన కోసం చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. మూడు నిర్ణీత సమయాలలో వారు భౌతికంగా స్ట్రాంగ్ రూమ్‌కు సమీపంలోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
. మీడియా విభాగం ద్వారా ఎప్పటి కప్పుడు కౌంటింగ్ వివరాలు అందచేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మీడియా విభాగంలో సమాచార సేకరణ సంభందించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్క్రీన్ ఏర్పాటు, కౌంటింగ్ చేసే ప్రక్రియ, సీసీ కెమెరాలు నిఘా వ్యవస్థ పరిశీలించ వచ్చునని కలెక్టర్ మాధవీలత తెలిపారు.

కౌంటింగ్‌ను శాంతియుతంగా నిర్వహించడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పోలీసులు, రెవెన్యూ సంయుక్తంగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ పి. జగదీష్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఏ ఒక్కరిని అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో ఒక కిలో మీటరు పరిధి మేరకు సెక్షన్.144 Cr.P.C. జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీచేయడం జరిగిందని ఆమేరకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. జూన్ 6 వ తేదీ వరకు జిల్లా మొత్తం కవర్ చేస్తూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ద్వారా 30 పోలీస్ యాక్ట్ ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. కౌంటింగ్ , స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడు అంచెల భద్రత 3 టైర్ సెక్యూరిటీ అంటే. CAPF ద్వారా అంతర్గత కార్డన్ (ఒక కంపెనీ), రాష్ట్ర ఆర్మ్డ్ పోలీస్ యొక్క 1 ప్లాటూన్ & సివిల్ పోలీసింగ్ ద్వారా లొకేషన్ మొత్తం ప్రాంగణం అదనపు ఎస్పీ, డిఎస్పీ లు, సి ఐ లు, ఎస్ ఐ లు, హేడ్ కానిస్టేబుల్, తగినంత పోలీసు కానిస్టేబుల్స్ విధుల్లో భాగస్వామ్యం చేసి, వ్యక్తిగత పర్యవేక్షణా చేస్తున్నట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగదీష్ తెలియ చేశారు. ఒక అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద బందోబస్తుకు నియమించినట్లు తెలిపారు.

ఈ పర్యటన లో కలెక్టర్ వెంట ఎస్పి పి జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కే దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, అదనపు ఎస్పీ ఎల్. చెంచి రెడ్డి, డిఆర్వో జి. నర్సింహులు, అనపర్తి ఆర్వో ఎమ్ మాధురీ, రూడా విసి బి. బాలస్వామి, డి ఐ పీఆర్వో సీహెచ్. శ్రీనివాస్, పిఆర్వో ఐ కాశయ్య, రెవెన్యు, పోలిసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కోలుసు పార్థసారథి కి అభినందనలు తెలిపిన ఏపిఏంపిఏ నాయకులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ మరియు సమాచార, పౌర సంబధాల శాఖ మంత్రిగా బాధ్యత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *