Breaking News

చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు సడలించాలి…  : గజ్జల వెంకటలక్ష్మి  

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు సడలించాలని  మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. ఏలూరు జిల్లా  కైకలూరులో తరగతి గదిలో విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం  ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి  ఫోక్సో చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. మైనర్ బాలికకు మెరుగైన వైద్యం, షెల్టర్ హోమ్ ద్వారా రక్షణ కల్పించాలని జిల్లా అధికారులకు సూచనచేసారు. అండగా ఉంటామని బాధితురాలి తల్లికి గజ్జల వెంకటలక్ష్మి చైర్పర్సన్ మహిళా కమిషన్ భరోసా ఇచ్చారు. ఏలూరు జిల్లా  కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం-వీడియో తీసిన యువకులు, కోరిక తీర్చాలంటూ బెదిరింపులు. పదో తరగతి మార్కుల జాబితాను తీసుకెళ్లేం దుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి (15) తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్ లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించారు. సమాజంలో రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా కొందరు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఎంత కఠినంగా శిక్షించినా, కీచకుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. మహిళలకు అండగా నిలబడవలసిన సమయంలో  ఎలక్షన్ కమిషన్ నిబంధనలు సరికాదు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాలికలకు అవగాహన, మహిళలకు అండగా నిలబడేందుకు మహిళా కమిషన్ కు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనుమతినివ్వాలన్నారు.

Check Also

ప్రత్యేక హెూదా కోసం పవన్ కల్యాణ్ పోరాడాలి… : నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి ప్రత్యేక హెూదాతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ఒప్పించేందుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *