Breaking News

Daily Archives: July 12, 2024

కృష్ణ మందిరం నిర్మాణానికి స‌హ‌కారం అందిస్తాను :ఎంపి కేశినేని శివ‌నాథ్

-జగన్నాథుడికి హార‌తిచ్చిన ఎంపి కేశినేని చిన్ని -ఇస్కాన్‌ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర -చేరా ప‌హారా సేవ చేసిన ఎంపి కేశినేని చిన్ని విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుంభమేళా తర్వాత అత్యంత ప్రాచీన ఉత్సవం పూరీలో జగన్నాథ్ రథయాత్ర. నాలుగేళ్ల నుంచి ఆ జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర ను న‌గ‌రంలో నిర్వ‌హించ‌టం విజ‌య‌వాడ వాసుల అదృష్టం. జిల్లాలో జగత్తుని నడిపించే శ్రీ కృష్ణుడి మందిరం నిర్మాణానికి త‌న వంతు స‌హ‌కారం అందిస్తాన‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. ఎంజి రోడ్డులోని ది …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు జిల్లా నివేదిక స‌మ‌ర్పించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ శుక్ర‌వారం సెక్ర‌టేరియ‌ట్ లో సీఎం చంద్ర‌బాబు నాయుడును క‌లిసి ఎన్టీఆర్ జిల్లాలో త‌ను నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశాల నివేదిక‌ను అందించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్శిటీ నుంచి నిడ‌మానురు వ‌రకు రాబోయే ఫ్లైఓవ‌ర్ కి సంబంధించి స‌మ‌గ్ర రిపోర్ట్ సిద్దం చేస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. అలాగే తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం ఎ.కొండూరు కిడ్నీ బాధితుల స‌మ‌స్య గురించి ,అక్క‌డ వున్న నీటి స‌మ‌స్య వివ‌రించారు. కిడ్నీ బాధితుల్ని ఆదుకోవాల్సిందిగా కోర‌టం జ‌రిగింది. ఇక విజ‌య‌వాడ ఇంట‌ర్నేష‌న‌ల్ …

Read More »

విజ‌య‌వాడ ఎయిర్ పోర్ట్ కొత్త‌ టెర్మిన‌ల్స్ తొమ్మిది నెల‌ల్లో పూర్తి చేస్తాం: ఎం.పి కేశినేని శివ‌నాథ్

-గ‌న్న‌వ‌రం అభివృద్ది క‌మిటీ స‌మీక్షా స‌మావేశం -స‌మావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు -గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో విమానాశ్ర‌య అభివృద్ది శూన్యం -నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ -కొత్త టెర్మిన‌ల్ నిర్మాణ ప‌నుల‌పై వారం వారం స‌మీక్ష‌ గ‌న్న‌వరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరావ‌తి రాజ‌ధాని లో వున్న ఏకైక ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ ను గ‌త ప్ర‌భుత్వం ఐదేళ్లుగా అభివృద్ది చేయ‌కుండా కొత్త‌ టెర్మిన‌ల్ ప‌నులు అటకెక్కించింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్ఫూర్తిగా తీసుకుని కొత్త టెర్మిన‌ల్ ను …

Read More »

తిరుపతి స్మార్ట్ సిటీ నిర్మాణ పనులు నిర్దేశించిన గడువు లోపు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ మరియు స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ చైర్మన్ ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి స్మార్ట్ సిటీ నిర్మాణానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు తిరుపతి స్మార్ట్ సిటీ ఆఫ్ చైర్మన్ ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్ నందు తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… తిరుపతి స్మార్ట్ సిటీ నిర్మాణానికి సంబంధించిన వివిధ రకాల పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. ఇందిరా మైదానం …

Read More »

ఈ నెల 14 న నిర్వహించనున్న యుపిఎస్సి Combined Medical Services-2024 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

-తిరుపతి జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు -హాజరుకానున్న 1199 అభ్యర్థులు : స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యం.యస్ మురళి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 14న జిల్లాలో జరగనున్న యూపీఎస్సీ Combined Medical Services-2024 పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యం.యస్ మురళి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సంబంధిత అధికారులతో ఈ నెల 14 న జరగనున్న యుపిఎస్సి పరీక్షల నిర్వహణపై …

Read More »

ఈనెల 18వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధి సర్వే కార్యక్రమం…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 18వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధి సర్వే చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, మరియు జిల్లా కుష్టు ఎయిడ్స్ మరియు టీవీ అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని వైద్యాధికారులందరికీ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీహరి ప్రారంభించారు. జిల్లాలోని ఆశ, మగ వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చర్మం మీద స్పర్శ లేని …

Read More »

పంచాయతీలు, అర్బన్ ప్రాంతాల్లో 100 శాతం పన్నులు లక్ష్యం సాధించాలి

-పన్నుల వసూళ్లు ను వారం రోజుల్లో పూర్తి చెయ్యాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్థిక స్వావలంబన ప్రధాన వనరు అని, పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ దృశ్య మాధ్యమం ద్వారా పన్నుల వసూళ్లు, ఉచిత , తదితర అంశాలపై ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కే. దినేష్ కుమార్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

ఫిజియో థెరపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం

-చివరి తేదీ జూలై 18 సాయంత్రం ఐదు గంటల వరకు -ఎస్ ఎస్ ఎస్ – పిడి సుభాషిణి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా లో అనపర్తి , కోరుకొండ క్లస్టర్స్ పరిధిలో ఖాళీ గా ఉన్న రెండు ఫిజియో థెరపిస్ట్ పోస్టుల తాత్కాలిక ప్రాతిపదికన నియామకం కొరకు దరఖాస్తుల ఆహ్వానించడం జరుగుతుందని జిల్లా సర్వ శిక్ష అభియాన్ అధికారి ఎస్ సుభాషిణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫిజియో థెరపిస్ట్ .విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులు నుంచి …

Read More »

పారిశ్రామిక, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రాథమిక సమీక్ష

-శనివారం పి ఎమ్ విశ్వకర్మ పై సమన్వయ శాఖలతో సమీక్ష -100 రోజులు, 200 రోజుల పారిశ్రామిక, ఉద్యోగ, ఉపాధి కల్పన యాక్షన్ తో రావాలి -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలు, యువతకి ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యంగా సమగ్ర నివేదిక సిద్ధం చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో పరిశ్రమలు, నైపుణ్య అభివృద్ధి, డిఆర్డిఏ ఏపీ ఐఐసి, జిల్లా అభివృద్ధి …

Read More »

టూరిజం లో ఉన్నత అధికారుల పై సమగ్ర విచారణ జరిపి మరలా మాకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఆదుకోవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవాని ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ లో పనిచేసే ఎంప్లాయిస్ ని ఉద్యోగాల నుంచి తొలగించిన అధికారుల పై సమగ్ర విచారణ చేసి మరల మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భవాని ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ లో పనిచేసే ఎంప్లాయిస్ ఈరోజు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. భవానిపురం ఐలాండ్లో ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ గా 11 మంది గత ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వారికి విధించిన స్వీపర్స్, సెక్యూరిటీ గార్డ్, …

Read More »