Breaking News

90వ వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా RBI90 క్విజ్‌తో జరుపుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, ఆంధ్రప్రదేశ్ – అక్టోబర్ 28, 2024 – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ సంవత్సరం తన కార్యకలాపాలకు 90వ వార్సికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ మైలురాయికి గుర్తుగా ఏడాది పొడవునా నిర్వహిస్తున్న ఈవెంట్‌ల శ్రేణిలో భాగంగా, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా సాధారణ జ్నాన ఆధారిత క్విజ్ పోటీ అయిన RBI90 క్విజ్‌ను ప్రారంభించింది. RBI90 అనేది జట్టు – ఆదారిత పోటీ, ఇది బహుళ దశల్లో నిర్వహించబడుతుంది. ఆన్‌లైన్ దశ సెప్టెంబర్ 19-21, 2024 వరకు నిర్వహించబడింది. ఆన్‌లైన్ దశలో పనితీరు ఆధారంగా, రాష్ట్రస్థాయి రౌండ్‌లలో పాల్గొనడానికి కళాశాల జట్లను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ కోసం RBI90 క్విజ్ రాష్ట్ర స్థాయి రౌండ్ విజయవాడలోని హోటల్ నోవాటెల్‌లో నిర్వహించబడింది, ఇక్కడ 166 మంది విద్యార్థులు (83 జట్లు) పోటీ పడ్డారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి చెందిన కృతజ్న శర్మ, ఉజ్వల్ నారాయణ్‌లతో కూడిన బృందం విజేతలుగా నిలవగా, కర్నూలుకి చెందిన స్పేసెస్ డిగ్రీ కాలేజ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ వారు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా రూ.2 లక్షలు, రూ.1.5లక్షలు మరియు రూ.లక్ష బహుమతిగా అందనున్నాయి. గెలిచిన జట్టు ఇప్పుడు జోనల్ రౌండ్‌లో పోటీ పడనుంది. ఇది నవంబర్ 21, 2024 మరియు డిసెంబర్ 4, 2024 మధ్య జరుగుతుంది. జాతీయ ఫైనల్ డిసెంబర్ 2024లో ముంబయిలో జరుగుతుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *