విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానిపురం 40 వ డివిజన్ పరిధిలోని లారీ డ్రైవర్ పెనుబోతుల రాంబాబు 48 ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. మృతునికి ఇద్దరు పిల్లలు. నిరుపేదలైన రాంబాబు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని 40 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు పి వి చిన్న సుబ్బయ్య ఎమ్మెల్యే సుజనాను కోరగా తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. మృతుని భార్యకు ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే సుజనాకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News