Breaking News

Daily Archives: July 13, 2024

అనంత్ అంబాని వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ముంబై, నేటి పత్రిక ప్రజావార్త : ముంబైలో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద వివాహ వేడుకలలో ఒకటిగా నిలిచింది. జూలై 12 నుంచి ముంబైలో ప్రారంభమైన ఈ ఈవెంట్ మూడు రోజుల పాటు జరగనుంది. ఈ అద్భుత ఘ‌ట‌న‌ను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వ‌చ్చారు. అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ జూలై 12న వివాహం చేసుకున్నారు. అనంతరం జులై 13న శుభాశీస్సులు అందజేస్తున్నారు. ఈ …

Read More »

పతనమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవాలి

-రిటైర్డ్ ఐఎయస్ అధికారి డాక్టర్ పి.వి.రమేష్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో గత ఐదు సంవత్సరాల కాలంలో ఆర్థిక వ్యవస్థ పతనమైందని, 14 లక్షల కోట్లకు అప్పులు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పి.వి. రమేష్ పేర్కొన్నారు. ఈనెల 13వ తేదీన గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి కార్యాచరణ అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన …

Read More »

అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభం చేయనున్నది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవానికి నాణ్యమైన అల్పాహారం, భోజనంను నామమాత్రపు ధరకే అందించేందుకే సంకల్పించిన గుంటూరు నగరంలోని అన్నా క్యాంటీన్లను ఆగస్ట్ మొదటి వారానికి పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్న క్యాంటీన్లలో జరుగుతున్న మరమత్తు పనులపై శనివారం ఇంజినీరింగ్ అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

ముడసర్లోవ పార్కు వద్ద పర్యావరణానికి హాని కలిగించే చర్యలు వద్దు

-విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త ఈ.ఎ.ఎస్. శర్మ ఫిర్యాదుపై స్పందించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -జీవీఎంసీ అధికారుల వివరణ కోరిన ఉప ముఖ్యమంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలోని ముడసర్లోవ పార్క్ పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జీవీఎంసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముడసర్లోవ పార్కులో జీవీఎంసీ కట్టడాలు చేపడితే పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని విషయాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త …

Read More »

విపత్తుల నివారణకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆలంబన

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థను సందర్శించిన ఆర్ పి సిసోడియా అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : విపత్తుల ఎదుర్కోడానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలని వినియోగించుకోవాలని రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా సూచించారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన ఆర్ పి సిసోడియా , సంస్థ అవలంబిస్తున్న సాంకేతికతలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు ముందుస్తు జాగ్రత్త చర్యలు, ప్రణాళికలు అమలుచేస్తూ, హెచ్చరికలు జారీచేస్తూ ప్రాణ, ఆస్తి నష్టాల్ని తగ్గించాలని సిసోడియా సూచించారు. విపత్తుల్లో …

Read More »

తన కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వద్దని ప్రజలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

-తల్లిదండ్రులు, గురువు, భగవంతుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలి -నాయకుల కాళ్లకు ప్రజలు దండాలు పెట్టే విధానం వద్దు :- సిఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లకు నమస్కారం చేసే పని చేయవద్దని సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజలతో కాళ్లకు నమస్కారం పెట్టించుకునే సంస్కృతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంత వారిస్తున్నా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు కాళ్లకు నమస్కారాలు చేస్తున్నారని…ఇలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, గురువులు, …

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా పశు పోషకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు

-రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు  -పశు పోషకులకు 90% రాయితీపై షెడ్ల నిర్మాణం. -గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్లకు 70% రాయితీ.. -గరిష్ఠంగా యూనిట్ కు 2.3 లక్షలు -అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి మరియు గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరచడానికి NDA ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల మంత్రివర్యులు కింజరాపు …

Read More »

శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా దర్శన, వసతి

-మధ్యవర్తులు, దళారీల బెడద లేకుండా చర్యలు -ఇకపై ఆధార్ తో శ్రీవారి సేవలు కల్పించేందుకు ప్రయత్నాలు : టీటీడీ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : దేశ విదేశాల నుండి ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న దర్శనము, వసతి తదితర సేవలు దళారుల ప్రమేయం లేకుండా, మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా టీటీడీ భక్తులకు ఆఫ్‌లైన్ (కౌంటర్ సేవలు) మరియు ఆన్‌లైన్ (వెబ్ పోర్టల్) రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది …

Read More »

ఈ నెల 18 నుంచి 28 వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం

-10 రోజులపాటు కొనసాగనున్న నాలుగో విడత సభ్యత్వ నమోదు -ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ -సమష్టిగా పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు పని చేద్దాం -సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహా క్రతువు మరోసారి ప్రారంభం కానుంది. ఈ నెల 18 నుంచి 28వ తేదీ …

Read More »

చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులు..

-ప్రధానమంత్రి విశ్వకర్మ క్రింద నమోదు చేసుకోవచ్చు. -18 రకములైన చేతివృత్తులు చేసుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం ఉపాధి ప్రాతిపదికన, చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులు సమగ్ర సహాయాన్ని అందుకునేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ క్రింద నమోదు చేసుకోవడానికి అర్హులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పి …

Read More »