-ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డ్రసల్ సిస్టం) ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో -ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నగర ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ విన్నపం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డ్రసల్ సిస్టం ) ప్రతి సోమవారం ఉదయం 10 గంటల కు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నందున ప్రజలందరూ తమ …
Read More »Daily Archives: July 14, 2024
పారిశుధ్య నిర్వహణలో లోపం ఉంటే ఖఠిన చర్యలు తప్పవు
-నగర ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత రెండు రోజులుగా వర్షం నిరంతరాయంగా పడుతున్న సందర్భంగా నగరంలో వర్షం వల్ల రోడ్ల పైన నీటి నిల్వలు తీసుకున్న చర్యలు పరిశీలించడానికి విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ ఆదివారం నాడు తన పర్యటనలో భాగంగా సర్కిల్ 3 పరిధిలోని 16 డివిజన్ పోలీస్ కాలనీ రిటైనింగ్ వాల్ ఏరియా, సర్కిల్ 2 పరిధిలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం, …
Read More »ప్రజా దర్బార్ లో ప్రజల నుండి అర్జీలు స్వీకరన… : మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నానికి మహర్దశ రాబోతుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని జవ్వారిపేట పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఒకవైపున జోరుగా వర్షం కురుస్తున్న మరోవైపు అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం …
Read More »ప్రజా భవన్‌లో బోనాల సంబురాలు…
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాఢ మాసం సందర్భంగా ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిసున్నారు. అయితే.. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి సీఎం, డిప్యూటీ సీఎం బోనం సమర్పించుకున్నారు. అనంతరం ప్రజా భవన్ నుంచి.. అబ్దుల్లాపూర్ మెట్‌కు సీఎం రేవంత్ బయలుదేరి వెళ్లారు. కాటమయ్య రక్ష …
Read More »పట్టిసీమ నీటిని పులిగడ్డ ఆక్విడెక్టు ద్వారా దివిసీమకు విడుదల…
మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : బ్రిటిష్ వారు కూడా ప్రాధాన్యత ఇచ్చిన ఇరిగేషన్ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం మోపిదేవి వార్పు వద్దకు కేఈబీ ప్రధాన పంట కాలువ ద్వారా వచ్చిన పట్టిసీమ నీటిని పులిగడ్డ ఆక్విడెక్టు ద్వారా దివిసీమకు విడుదల చేసే మహోత్సవం జరిగింది. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విచ్చేసి పట్టిసీమ నీటికి ప్రత్యేక పూజలు చేసి దివిసీమకు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ నీటితో …
Read More »గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు
-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటి ప్రతినిధులతో కలిసి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని, పయ్యావుల కేశవ్ ని కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గతంలో హామీ ఇచ్చిన విధంగా గ్రామపంచాయతీలకు 15 వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయలు నిధులు విడుదల …
Read More »విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖవాసులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శుభవార్త అందించింది. ఇటీవల విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి .. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో కొంత కదలిక వచ్చింది. విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలోనే విశాఖ పర్యటనలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి గతంలో నిర్ణయించిన డిజైన్లకు అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. విశాఖలో ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించే …
Read More »కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దుతా… : బండి సంజయ్
కరీంనగర్, నేటి పత్రిక ప్రజావార్త : కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దేందుకు నిధులు తెచ్చే బాధ్యత తనదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో పార్టీలకతీతంగా కరీంనగర్ మేయర్ తోపాటు కార్పొరేటర్లు బండి సంజయ్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరూ కలిసి సన్మానిస్తారని నేను ఊహించలేదన్నారు. ఇదే కార్పొరేషన్ లో నేను రెండుసార్లు కార్పొరేటర్ గా పనిచేశానని గుర్తు చేశారు. కార్పొరేటర్లంతా అభివృద్ధికి పనిచేయాలన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ కార్పొరేషన్ కు …
Read More »iJU జాతీయ నాయకులు స్వర్గీయ అంబటి ఆంజనేయులు ప్రథమ వర్ధంతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : iJU జాతీయ నాయకులు స్వర్గీయ అంబటి ఆంజనేయులు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు I.V సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, IJU నాయకులు ఎస్కే బాబు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు యేచూరు శివ. విజయవాడ అర్బన్ యూనియన్ అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాస నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్ రమణారెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మీరా, …
Read More »శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులు ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్‌ను జేఈవో శ్రీ వీరబ్రహ్మం అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జేఈఓ వీరబ్రహ్మం, జేఈఓ శ్రీమతి గౌతమి, జెసి ధ్యాన చంద్ర, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్, డెప్యూటీ ఈవోలు శ్రీ …
Read More »