అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. ఆయన 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. వెంకయ్య చౌదరిని డిప్యుటేషన్ పై పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఆయన డిప్యుటేషన్ పై ఏపీలో మూడేళ్ల పాటు పనిచేయనున్నారు. ఆయన గతంలో ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్, ఎండీగా పనిచేశారు.
Read More »Daily Archives: July 16, 2024
సీఎంఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా డీఎస్పీ యశ్వంత్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా జమ్మలమడుగు డీఎస్పీ యశ్వంత్ నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జమ్మలమడుగు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన యశ్వంత్.. ఎన్నికలను నిజాయితీగా నిర్వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సమర్ధవంతంగా విధులు నిర్వర్తించినందుకు గానూ, ఆయనను ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యశ్వంత్ గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు, ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి, తిరుపతి వెస్ట్, …
Read More »సంపద సృష్టి ద్వారా సిసలైన సంక్షేమం
-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : సంపద సృష్టించడం ఎన్డీయే కూటమికి తెలుసునని, రానున్న కాలంలోనూ సంపద సృష్టించి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని నందిగామ ఎమ్మెల్యే తంరిగాల సౌమ్య స్పష్టం చేసారు. మంగళవార నాడు నందిగామ పట్టణం నీరుకొండ నరసింహారావు సమావేశ మందరంలో జరిగిన ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం, నందిగామ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సౌమ్యకు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో సంఘ …
Read More »జులై 17న స్కూలు, కాలేజీలకు సెలవు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ, తెలంగాణ రాష్ర్టాల విద్యార్థులకు ప్రభుత్వాలు శుభవార్త అందించాయి. హిందువుల తొలి ఏకాదశి, ముస్లింల మొహర్రం సందర్భంగా రేపు (జులై 17న బుధవారం) సెలవు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి.. తొలి ఏకాదశి పండుగ.. హిందువులకు ఎంతో ప్రీతికరమైన రోజు.. పైగా హిందువులకు తొలి పండుగ ఈ రోజునే జరుపుకుంటారు. ఈరోజు భక్తులు దేవాలయాలకు వెళ్లి విష్ణుమూర్తిని పూజిస్తారు. ఉపవాసం ఆచరించి భక్తిశ్రద్ధలతో భగవాన్మమస్మరణ చేస్తారు. అలాగే, మోహరం ఇస్లామిక్ క్యాలెండర్లో ఇది మొదటి నెల. …
Read More »ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ప్రజారోగ్యానికి భంగం కల్గేలా పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడం పలు ప్రాంతాల్లో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉండడం, సమగ్ర పర్యవేక్షణ లోపం పై నగరపాలక సంస్థ సిఎంఓహెచ్ డాక్టర్ ఆషా ని సరెండర్ చేస్తున్నామని, బృందావన్ గార్డెన్స్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.వి.ఎస్.ప్రసాద్ ని సస్పెండ్, కొత్తపేట శానిటరీ ఇన్స్పెక్టర్ హిదయతుల్లా పై చార్జెస్ ఫ్రేం చేసి, అక్కడి నుండి బదిలీ చేస్తున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కమిషనర్ బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం, బ్రాడిపేట, …
Read More »తాగునీటి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి…
చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : చల్లపల్లి గ్రామ భవిష్యత్ తాగునీటి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధికారులకు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం చల్లపల్లి నారాయణరావు నగరులో జల జీవన్ మిషన్ నిధులతో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ఎమ్మెల్యే పరిశీలించారు. కాలనీలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వినియోగంలోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రామంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు తగిన స్థాయిలో నీటి వనరులు సమకుర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బీ.సుమతి, …
Read More »ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో 62 శాతం సీట్ల భర్తీ
-సాంకతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ నవ్య -ముగిసిన పాలిసెట్ తుదిదశ ప్రవేశాల ప్రక్రియ -జులై 20లోపు పాలిటిక్నిక్ లలో విద్యార్ధుల రిపోర్టింగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తుది దశ కౌన్సిలింగ్ ముగిసిన తరువాత రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రవేటు కళాశాలల్లో 46 శాతం కన్వీనర్ కోటా సీట్టు భర్తీ అయ్యాయని సాంకతిక విద్యా శాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. మొత్తం 262 విద్యా సంస్ధలలో 81,420 సీట్లు ఉండగా, 37,036 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. 88 …
Read More »గల్ఫ్ వర్కర్స్ సంరక్షణపై దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ నాగరాణి
-రిజిస్టర్ ఏజెన్సీల ద్వారా మాత్రమే గల్ఫ్ కి వెళ్ళేలా చర్యలు -ఉపాధి పొందేందుకు వెళ్లే మహిళలకు ప్రత్యేక శిక్షణకు కార్యాచరణ -మహిళలు మోసపోకూడదన్న లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ముందడుగు భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : గల్ఫ్ వలస కారణంగా ఏ మహిళ మోసపోకూడదనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక కార్యచరణతో రంగంలోకి దిగారు. గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా వర్కర్ల ఆవేదనను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా తెలుసుకున్న కలెక్టర్ నివారణ …
Read More »వ్యక్తిగత జీవితాలలోకి చొరబడే విధానం తగదు… : నేతి మహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జరుగుతున్న వ్యక్తిగత జీవితాలలోకి చొరబడే విధానం తగదు అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు స్పందించారు. మంగళవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 164 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి ఈ ప్రభుత్వం మీద బృహత్తర బాధ్యత పెట్టారు అలాంటి బాధ్యతను నిర్వర్తించాల్సిన ఈ ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన మీడియా అనవసరమైన విషయాల జోలికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ …
Read More »ప్రత్యేక హోదాతోనే యువతకు ఉపాధి… : నాగిరెడ్డి దశరథ రామిరెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం అన్నిరకాలుగా వెనుకబడి ఉందని ఒకపక్క అప్పులు మరొపక్క యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోవటం ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తేనే పెద్దఎత్తున పరిశ్ర మలు వచ్చి యువతకు ఉద్యోగ అవకాశలు లభించటమే కాకుండా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెంది ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నాగిరెడ్డి దశరథ రామిరెడ్డి తెలిపారు. మంగళవారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని …
Read More »