Breaking News

Daily Archives: July 22, 2024

“కౌన్సిల్ చైర్మన్ కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం “

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన ఇద్దరు అభ్యర్థులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సి. రామచంద్రయ్య, పిడుగు హరి ప్రసాద్ లతో శాసన పరిషత్తు చైర్మన్ కొయ్యే మోషేను రాజు తన కార్యాలయంలో నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ, శాసన పరిషత్తు నియమ నిబంధనల పుస్తకాలను నూతన ఎమ్మెల్సీలకు చైర్మన్ అందజేశారు. సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర కార్యక్రమం నిర్వహించగా శాసన మండలి సభ్యులు పంచుమర్తి అనురాధ, జాయింట్ …

Read More »

అమరావతి కాపునాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుగా నరహరిశెట్టి సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాపుల సంక్షేమం, అభివృద్ధికి అమరావతి కాపునాడు కట్టుబడి ఉందని అమరావతి కాపునాడు రాష్ట్ర గౌరవాధ్యక్షులు సంకర సత్యనారాయణ అన్నారు. సోమవారం గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో అమరావతి కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి కాపునాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా నరహ‌రిశెట్టి సత్యనారాయణను నియమిస్తు నియామక పత్రాన్ని అందచేశారు అనంతరం సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా కాపు నాయకుడు వంగవీటి రంగా ఆశయాలకు …

Read More »

జాయింట్ క‌లెక్ట‌ర్‌గా సంప‌త్ కుమార్ సేవ‌లు అద్వితీయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా డా. పి.సంప‌త్ కుమార్ అందించిన సేవ‌లు అద్వితీయ‌మ‌ని.. ఆయ‌న అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నార‌ని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన పేర్కొన్నారు. జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా పనిచేసిన సంప‌త్ కుమార్ విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీపై వెళ్తున్న నేప‌థ్యంలో సోమ‌వారం పింగళి వెంకయ్య సమావేశం మందిరంలో జ‌రిగిన వీడ్కోలు కార్య‌క్ర‌మంలో ఆయ‌న్ను జిల్లా అధికారులు ఘనంగా స‌త్క‌రించారు. వివిధ శాఖ‌ల అధికారులు ఆయ‌న‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. …

Read More »

ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సు కు దరఖాస్తులు ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఉన్నటువంటి స్కిల్ హబ్ లో ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్స్ నాల్గవ బ్యాచ్, డిజిటల్ మార్కెటింగ్ మూడవ బ్యాచ్ ను ప్రారంభించడం జరుగుతుందని, జూలై నెలలో ప్రారంభించే కోర్స్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇప్పటికే వివిధ రకాల ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోర్సుల …

Read More »

ఎర్ర కాలువ ఏటిగట్లు పటిష్టతకు ఆధునీకరణ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది

-వరద ఉధృతి కారణంగా రైతు నష్టపోయిన ప్రతి ఎకరాకు ఇన్పుట్ సబ్సిడీ అందించే చర్యలు చేపడతాం. -మోకాలు లోతు వరదనీటిలో వీధుల్లో వెంబడి నడిచి పునరావాస కేంద్రాల్లో ఉన్న నిర్వాసితులను పరామర్శించి వారికి అందుతున్న, ఆహారం, వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్న మంత్రి. -రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఎర్ర కాలవ వరద ఉధృతి వలన పంట పొలాలు నష్టపోవడమే కాకుండా గ్రామాల్లోనికి నీరు చేరి ఇల్లు కూడా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయని, …

Read More »

ధవళేశ్వరం అంగన్వాడీ కేంద్రం తనిఖీ

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చెయ్యడం జరిగిందని రాజమహేంద్రవరం రూరల్ మండల ప్రత్యేక అధికారి) జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి కే ఎన్. జ్యోతి పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ధవళేశ్వరం అంగన్వాడీ కేందాన్ని ఎంపిడివో డి. శ్రీనివాస్ తో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కే. ఎన్ జ్యోతి వివరాలు తెలియా చేస్తూ, అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ లకు, చిన్నారులకు తాగేందుకు వేడి మంచినీళ్లు ఇవ్వడం, …

Read More »

ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా లంక గ్రామాల ప్రజల తరలింపు

-నగరంలో ఏర్పాటు చేసిన రెండు పునరావాస కేంద్రాలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరీ ప్రాంతంలోని మూడు లంక గ్రామాల్లో ఉన్న కుటుంబాలను ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందని రెవిన్యూ డివిజనల్ అధికారి ఏ.. చైత్ర వర్షిణి తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మత్స్య, అగ్నిమాపక, రెవిన్యూ, మునిసిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఐదు లంకా గ్రామాల్లోని కుటుంబాలను తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో ఏ . చైత్ర వర్షిణి వివరాలు తెలియ చేస్తూ, గోదావరీ నది …

Read More »

పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్

-గోదావరి పరివాహక ప్రాంతపు ఘాట్లు వద్ద 24/7 పోలీస్ ప్రహర ఉంటుంది. -చందా సత్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి మహిళలతో మాట్లాడుతున్న కలెక్టర్ -పునరావాస కేంద్రాల్లో అల్పాహారం, భోజనం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే అధికారులు చర్యలు చేపట్టాలి. -పురుషులకు, స్త్రీలకు విడిగా టాయిలెట్స్ ఏర్పాటు చెయ్యాలి -శానిటేషన్ విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పై ప్రాంతాలలో భారీ వర్షాలు కారణంగా గోదావరి ఉధృతి అధికంగా ఉన్నందున ధవళేశ్వరం …

Read More »

గోదావరీ నదికి వరద ప్రవాహం మొదటి హెచ్చరిక

-రాత్రికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం -పునరావాస, ముంపు ప్రాంతాల్లో తరలింపు కై సన్నద్ధంగా ఉండాలి -పునరావాస కేంద్రాల్లో వేడి త్రాగునీరు, వేడిగా ఉన్న ఆహారం అందచెయ్యాలి -వరద ప్రభావ ప్రాంతాల్లో హెచ్చరికలు చేసి ప్రజలను అప్రమత్తం చెయ్యాలి -వరద ప్రవాహాన్ని చూసేందుకు ఎవ్వరూ రావద్దు, అటువంటి వారిపై కేసులు నమోదు హెచ్చరికలు జారీ చెయ్యాలి – వరద ప్రభావం వల్ల త్రాగునీరు సరఫరాలలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల తో సిద్దంగా ఉండాలన్నారు. -వ్యవసాయ అనుబంధ నష్టాల అంచనాలు, …

Read More »

విపరీతమైన వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళికలతో అధికారులు సన్నద్ధంగా ఉండాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విపరీతమైన వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళికలతో అధికారులు సన్నద్ధంగా ఉండాలని, ఎలాంటి మానవ, పశు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు అధికారులతో సమావేశం నిర్వహించి భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ముందస్తుగా ప్రణాళికలతో అధికారులు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నీటి …

Read More »