-గోదావరి పరివాహక ప్రాంతపు ఘాట్లు వద్ద 24/7 పోలీస్ ప్రహర ఉంటుంది.
-చందా సత్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి మహిళలతో మాట్లాడుతున్న కలెక్టర్
-పునరావాస కేంద్రాల్లో అల్పాహారం, భోజనం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే అధికారులు చర్యలు చేపట్టాలి.
-పురుషులకు, స్త్రీలకు విడిగా టాయిలెట్స్ ఏర్పాటు చెయ్యాలి
-శానిటేషన్ విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పై ప్రాంతాలలో భారీ వర్షాలు కారణంగా గోదావరి ఉధృతి అధికంగా ఉన్నందున ధవళేశ్వరం బ్యారేజ్ ఇప్పటికే మొదటి హెచ్చరిక జారీ చేయడం జరిగిందని, నగర ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఘాట్లు వద్దకు ఎవ్వరూ రావద్దని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు.
సోమవారం నగరంలోని పుష్కర్ ఘాట్, చందా సత్రం పునరావాస ప్రాంతాలను కలెక్టర్ ప్రశాంతి.. మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ , ప్రత్యేక అధికారులతో కలసి పర్యటించి గోదావరి వరద ఉధృతి పరిస్థితులను స్వయంగా పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకి, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ గోదావరి నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున బ్రిడ్జిలంకలో నివసిస్తున్న 175 కుటుంబాలను వెంటనే పునరావాస కేంద్రానికి తరలించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించడంతో వెంటనే అధికారులు వారందరిని పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టారు. రిహాబిలిటేషన్ సెంటరుకు వచ్చే వారందరికీ మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు పక్కాగా ఉండే విధంగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను వారి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పునరావాసన కేంద్రానికి వచ్చిన ఏ ఒక్కరూ ఇబ్బందులకు గురికాకుండా వారికి వసతి ఏర్పాట్లతో పాటు అల్పాహారం, భోజన సౌకర్యం, వైద్య సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి వరద ఉధృతి ప్రభావం వలన ఇప్పటికే ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి హెచ్చరిక జారీ చేయడం జరిగిందన్నారు. రాత్రికి రెండవ ప్రమాద హెచ్చరిక నేపధ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఏ ఒక్కరూ నది ప్రాంతానికి, ఘాట్లు వద్దకు రావద్దని, సెల్ఫీ ఫోటోలను తీయవద్దని ప్రజలకు సూచించారు. గోదావరి నది పరివాహకు ప్రాంతంలోని లోతట్టు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే పునరావాస కేంద్రాలకు అధికారుల సూచన మేరకు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నది వరద ఉధృతిని పరిశీలించి, నిరంతర పర్యవేక్షణ దిశగా ఘాట్లలో పోలీస్ ప్రహార 24/7 విధులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం చందా సత్రంలోని పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి అక్కడికి వచ్చిన మహిళలతో మాట్లాడి, పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా గదులును ఇచ్చేలా, టాయిలెట్స్ లు ఉండేలా చర్యలు తీసుకోవా లన్నారు. రిహాబిలిటీ సెంటరుకు వచ్చినవారికి వసతి తో పాటు అన్ని సౌకర్యాలను కల్పించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేడి నీటిని, వేడిగా ఉన్న ఆహారం అందించాలని ఆదేశించారు
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ కే.దినేష్ కుమార్ ఆర్డీఓ ఏ.చైత్ర వర్షిణి , మున్సిపల్ అదనపు కమీషనర్ సత్యవాణి, ఇతర అధికారులు,శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News