అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి కోసం తుమ్మల మధుస్మిత అనే మహిళ రూ.4 లక్షలు విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి ఈ మేరకు చెక్ అందజేశారు. అమెరికాలోని న్యూ జెర్సీలో పనిచేస్తున్న మధుస్మిత అమరావతికి తనవంతు సహకారంగా ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మధుస్మితను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని సిఎం పిలుపునిచ్చారు.
Read More »Monthly Archives: July 2024
ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీని 1వతేదీ ఉ.6గం.లకే ప్రారంభించాలి
-ఆగస్టు నెలకు 64.82లక్షల ఫించన్లకు రూ.2737.41 కోట్లు విడుదల -1వతేదీనే 96శాతం పంపిణీ,2వ తేదీతో నూరు శాతం ఫించన్ల పంపిణీ పూర్తి చేయాలి -ఫించన్ల పంపిణీ ప్రక్రియలో జిల్లా కలక్టర్లు పాల్గొనాలి -ఫించన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి -గత నెలలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 1వ తేదీన ఉదయం 6గం.లకే ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో …
Read More »యూనిటీ మాల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున టెండర్లు ఆహ్వానం
-విశాఖ జిల్లా మధురవాడలో 5 ఎకరాల స్థలంలో యూనిటీ మాల్ నిర్మాణం -జ్యుడీషియల్ ప్రివ్యూ కోసం టెండర్ డాక్యుమెంట్ల దాఖలు -ఆసక్తి గల బిడ్డర్లు, సాధారణ ప్రజలు, స్టేక్ హోల్డర్ లు తమ సలహాలు, రిమార్కులు, అభ్యంతరాలు 6 ఆగస్టు, 2024 న సాయంత్రం 5 గంటలలోగా తెలపాలని సూచన -రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ జి. రేఖారాణి,ఐఏఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం జిల్లా మధురవాడలో యూనిటీ మాల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున టెండర్లు …
Read More »కృష్ణా డెల్టాలోని చివరి ఎకరాకు కూడా నీరందిస్తాం
-గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కృష్టా డెల్టాకు నీటి సమస్య -సాగునీటి రంగాన్ని చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం -కృష్ణా జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా డెల్టాలోని చివరి ఎకరా ఆయకట్టుకు కూడా సాగునీరిందించే బాద్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సాగునీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యేలు మండలి …
Read More »ఉపాధి హామీ పథకంలో పని చేసే 54 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు 2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గానూ లేబర్ బడ్జెట్ ను 21.50 కోట్ల పనిదినాలకు పెంచడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అంగీకరించిదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తెలిపారు. పెరిగిన పని దినాల వల్ల ఉపాధి హామీ పథకంలో పని చేసే 54 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుందని అయన చెప్పారు. లేబర్ బడ్జెట్ మొదటి విడతగా 15 కోట్ల …
Read More »సీబీఐకి అప్పగించమని జీవో ఇచ్చారుగానీ… ముందుకు తీసుకువెళ్లలేదు
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలసి వినతి పత్రం అందించిన సుగాలీ ప్రీతి తల్లి పార్వతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘మా అమ్మాయి సుగాలీ ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సీబీఐ వరకూ కేసు వెళ్లలేదు’ అని సుగాలీ ప్రీతి పార్వతి కన్నీటి పర్యంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతి పత్రం అందించారు. మంగళవారం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ని తన కుటుంబంతో …
Read More »ఒలింపిక్స్ లో మరో పతకం దక్కడం సంతోషదాయకం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పారిస్ ఒలింపిక్స్ లో మన దేశానికి మరో పతకం అందించిన షూటర్లు సరబ్ జోత్ సింగ్, మను బాకర్ లకు అభినందనలు. 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో కాంస్యం సాధించడం సంతోషదాయకం. మన దేశం నుంచి ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్ గా మను బాకర్ రికార్డు సాధించి క్రీడాభిమానులకు ఉత్తేజాన్నిచ్చారని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Read More »వన్యప్రాణులను అక్రమ రవాణా చేసినా… అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసినా కఠిన చర్యలు
-అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -విజయపురి సౌత్ రేంజ్ అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై పల్నాడు కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వన్య ప్రాణులను, జంతువులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిపై ఉపేక్షించవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్య ప్రాణి అలుగు …
Read More »ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియచేసి జ్ఞాపిక అందచేశారు. మంగళవారం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ గారినీ, ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ …
Read More »తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది నుండే అమలు చెయ్యాలి… : ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకారం ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది నుండే అమలు చేయాలని నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ ని అతిదారుణంగా హత్య చేసిన రోజు జనవరి 30-1948వ తారీఖుని గుర్తు చేస్తూ….ప్రతి నెల అదే 30వ తారీఖుని దేశంలో ప్రజలు మర్చిపోకుండా నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ ప్రతినెలా 30 తేదేన కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న …
Read More »