Breaking News

వన్యప్రాణులను అక్రమ రవాణా చేసినా… అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసినా కఠిన చర్యలు

-అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 
-విజయపురి సౌత్ రేంజ్ అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై పల్నాడు కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వన్య ప్రాణులను, జంతువులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిపై ఉపేక్షించవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్య ప్రాణి అలుగు (పంగోలియన్)ను వేటాడి అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకొనేటప్పుడు అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై మంగళవారం ఆరా తీశారు. వన్య ప్రాణులను, అటవీ సంపదకు నష్టం కలిగించినా, అక్రమ రవాణా చేసినా, ఉద్యోగులపై దాడులు చేసినా చట్టపరంగా కఠిన చర్యలలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం అరణ్య భవన్ లో నిర్వహించిన గ్లోబల్ టైగర్ డే కార్యక్రమంలో తను చదువుకొనే రోజుల్లో ఒంగోలులో అలుగును కొందరు వ్యక్తులు కొట్టి చంపడం జరిగిందనే విషయాన్ని ప్రస్తావించానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరోసారి ప్రస్తావించారు. విజయపురి సౌత్ అధికారులపై దాడి ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు. ఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. ఉద్యోగులపై దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంత పరిసరాల్లోని ప్రజలకు అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *