అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రావణం రాకతో కళ్యాణ మండపాలకు సందడి తెచ్చింది. మూడు నెలల విరామం తర్వాత పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగను న్నాయి. బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు 16 ముహూర్తాలు ఉన్నట్లు గా వేదపండితులు చెబుతున్నారు. సెప్టెంబర్ లో వివాహాలకు మళ్లీ బ్రేక్ పడనుంది. అప్పుడు అన్నప్రాసనాది ముహూర్తాలే ఉన్నాయి. సామగ్రి కొనుగోలు పెళ్లి ముహూర్తాల, చేతినిండా పని నేపథ్యంలో బంగారు, వస్త్ర, దుకాణాలు, బ్యూటీపార్లర్లు పెళ్లివారితో కిటకిటలా డనున్నాయి. పట్టణాలు, పల్లెల్లో ఉన్న …
Read More »Daily Archives: August 6, 2024
జనసేనలోకి విశాఖ వైసీపీ కార్పొరేటర్లు
-పార్టీలోకి ఆహ్వానించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పి వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జీవీఎంసీ 59వ వార్డు కార్పొరేటర్ పుర్రె పూర్ణశ్రీ, 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ, 47వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కంటిపాము కామేశ్వరి, 77వ వార్డు కార్పొరేటర్ భట్టు …
Read More »మౌళిక సదుపాయాలు-పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
-పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, డ్రోన్, టవర్, కంటెంట్, గ్యాస్ కార్పోరేషన్లపై సమీక్ష -రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్ లు….కుప్పం, దగదర్తి, నాగార్జున సాగర్, మూలపేటలలో నిర్మాణం -2014 -19లో ప్రతిపాదిత ఎయిర్ పోర్టులను పూర్తి చెయ్యాలని నిర్ణయం -ప్రతిష్టాత్మక ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారన్న సిఎం -వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన, రద్దు చేసిన అన్ని ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కాలి :- సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2014 -19 …
Read More »ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టి ప్రతి ఎకరాకు సాగునీరందించడమే ఈప్రభుత్వ లక్ష్యం
-ప్రస్తుతం ఎపిలోని రిజర్వాయర్లన్నీ జలకళను సంతరించుకున్నాయి -గత ప్రభుత్వం ఐదేళ్ళలో సాగునీటి వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది -కాలువగట్లు,ఏటిగట్ల పటిష్టతకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం -విధినిర్వహణలో అలసత్వం వహించిన కృష్ణా జిల్లా ఎస్ఇని ఇఎన్సికి సరెండర్ -పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరందించేందుకు చర్యలు చేపట్టాం -రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు డా.ఎన్.రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అందుబాటులో ఉండే ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ఈప్రభుత్వ ప్రధమ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు డా.నిమ్మల …
Read More »మైనార్టీలను దగా చేసిన వైసిపి ప్రభుత్వం
-2014-2019లో మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం పెద్దపీట -2019-2024లో మైనార్టీ పథకాలను నిర్వీర్యం చేసిన జగన్ -మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు -ఏపీ మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసిపి పాలనలో మైనార్టీల సంక్షేమం కు తీవ్ర విఘాతం కలిగిందని, మైనార్టీలందరినీ జగన్ ప్రభుత్వం దగా చేసిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు.2014-2019 టిడిపి ప్రభుత్వ …
Read More »నగరపాలక సంస్థకు చెందిన వాహనాలు అన్నీ కండీషన్ లో ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థకు చెందిన వాహనాలు అన్నీ కండీషన్ లో ఉండాలని, వాహనాల స్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ స్థానిక కెవిపి కాలనీలోని నగరపాలక సంస్థ వెహికిల్ షెడ్ ని, ఏటుకూరు రోడ్ లోని కంపోస్ట్ యార్డ్, వర్మి కంపోస్ట్ యూనిట్ లను, చుట్టగుంట జంక్షన్, జిటి రోడ్, శ్రీనివాసరావుతోట తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ …
Read More »నేడు ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
-చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత -చీరాలలో ముఖ్యమంత్రి సమక్షంలో కార్యక్రమం -విజయవాడలో నేత వస్త్రాలలో చేనేత నడక -అయా జిల్లాలలో సైతం స్ధానికంగా కార్యక్రమాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత తెలిపారు. చీరాలలో నిర్వహించే రాష్ట్ర స్దాయి కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు హాజరుకానున్నారన్నారు. రాష్ట్ర రాజధాని విజయవాడలో నిర్వహించే చేనేత దినోత్సవ వేడుకలను చేనేత నడకతో ప్రారంభించనున్నామన్నారు. …
Read More »నందిగామ, నూజివీడు లో ఈ విద్యా సంవత్సరం నుంచే కె.వి సంస్థలు ప్రారంభించాలి
-కేంద్ర విద్యాశాఖ మంత్రి కి ఎం.పి. కేశినేని శివనాథ్ విజ్ఞప్తి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, కృష్ణ జిల్లా లోని నూజివీడులో గతంలో మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయాల్లో ఈ విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ లోని ఆయన ఛాంబర్ లో కలిసి వినతి పత్రం అందజేశారు. 2023 సెప్టెంబర్ 22న జరిగిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ …
Read More »రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఉపాధి హామీ కార్మికులకి ఆలస్యంగా వేతనాలు
-పరిహారంగా రూ. 81,03,406 లక్షలు చెల్లింపు -జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ లో గత ఐదేళ్లుగా పని అడిగిన కార్మికులు ఎంత మంది వున్నారు? వారిలో ఎంత మంది కార్మికులకి ఉపాధి అవకాశం కల్పించారో… జిల్లాల వారీగా ఆ కార్మికుల సంఖ్య వివరాలు చెప్పాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ …
Read More »నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కొరకు 8వ తరగతి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు 8వ తరగతి చదువుచున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8వ తరగతి చదువుచూ, కుటుంబ సంవత్సరాదాయం రూ. 3,50,000/- లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ఈ పరీక్ష 08-12-2024 …
Read More »