Daily Archives: August 10, 2024

ఈనెల 15వ తేదీ నుండి రాష్ర్ట వ్యాప్తంగా రెవిన్యూ సదస్సులు

-వచ్చే నెల 30వరకు భూ వివాదాలపై ప్రతి గ్రామంలోనూ సభలు -భూ ఆక్రమణలు, 22 ఏ భూముల అక్రమాలతోపాటు అన్ని రెవిన్యూ సమస్యలపై అర్జీల స్వీకరణ -ప్రతి అర్జీని అన్లైన్ చేసి తగిన పరిష్కారం చూపుతాం -మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 15 నుండి వచ్చే నెల 30వ తేదీ వరకు రాష్ర్ట వ్యాప్తంగా రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తామని రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ఈ …

Read More »

ఆగ‌స్టు 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగ‌స్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగ‌స్టు 14న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను …

Read More »

వాస్తవ సాగుదారులకు / కౌలుదారులకు ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ పథకాలను పొందటానికి మరింత వెసులుబాటు

-బుడితి రాజశేఖర్ ఐఏఎస్ , ప్రత్యెక కార్యదర్శి (వ్యవసాయ & సహకారం) అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రైతు నాయకులు ,రైతు సంఘం ఐక్య వేదిక తదితరులతో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ IAS వారు శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రములోని కౌలు రైతులు అందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయటానికి, వారికి మరింత సంస్థగత రుణాలు ఇప్పించటానికి మరియు వివిధ వ్యవసాయ సంక్షేమ పథకాలను విస్తృత పరిచి అందించటానికి సవరణలతో కూడుకున్న కొత్త మార్గదర్శకాలు రూపొంది0చటానికి ఈ వీడియో …

Read More »

ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ…

-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమూకల దాడి హేయమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విగ్రహంపై దాడి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడాన్ని నిరసిస్తూ.. శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రం అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నేతలు, అంబేద్కర్ వాదులు ఆందోళన చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి కొవ్వొత్తులతో శాంతియుత నిరసన తెలిపారు. బాబా …

Read More »

పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడిఉంది

-కీలకమైన గ్రామీణ వ్యవస్థకు జీవం పోయాలన్నదే నా తపన -పలుమార్లు అధికారులతో సమీక్షల తర్వాత కీలకంగా మూడు నిర్ణయాలు -గ్రామ సభల నిర్వహణ, జల్ జీవన్ మిషన్ నిధుల వ్యయంపై పల్స్ సర్వే, స్వాత్రంత్ర్య, గణతంత్ర వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంపు ఆర్థికంగా పంచాయతీలను పరిపుష్టం చేసేలా అడుగులు వేస్తాం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ‘గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మార్గం’ అన్న మహాత్మా గాంధీజీ మాటలే మార్గదర్శకంగా- కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలను, ప్రజలతో …

Read More »

అమన్ సెహ్రావత్ కు అభినందనలు 

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యపతకాన్ని సాధించడం ఆనందాన్ని కలిగించింది. అమన్ సెహ్రావత్ కు మనస్ఫూర్తిగాఅభినందనలు తెలియచేస్తున్నాను. రెజ్లింగ్ విభాగంలో మన క్రీడాకారుల ప్రతిభ ప్రశంసనీయమైనది. వినేశ్ ఫోగాట్ దురదృష్టవశాత్తూ ఫైనల్ పోటీకి దూరమైనా అమన్ పతకంసాధించడంతో క్రీడాభిమానులు సంతోషంగా ఉన్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటనలో తెలిపారు.

Read More »

గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డు 2024 అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

-గ్లోబల్ స్థాయి అవార్డు రావడం మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నకు గర్వకారణం – -బుడితి రాజశేఖర్ ఐఏఎస్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (వ్యవసాయం & సహకారం) విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక పంచాయతీరాజ్ కమిషనర్ సమావేశ మందిరంలో శనివారం రెండవ రోజు ప్రకృతి వ్యవసాయం పై కార్యశాల కొనసాగింది. సాయంకాలం కార్యశాల ముగింపు కార్యక్రమములో గత జూలై నెలలో పోర్చుగల్ దేశపు ప్రకృతి వ్యవసాయం అత్యుత్తమ అవార్డు అయినటువంటి గుల్ బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024 అవార్డు ను …

Read More »

చివరి వినియోగదారుని వరకూ ఇసుక అందుబాటులో ఉంచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

-ఉచిత ఇసుక విధాన అమలు ప్రభుత్వ లక్ష్యం -అధికారులు సమన్వయంతో పనిచేయాలి -ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ లు సహకారం అందించాలి -కేవలం వినియోగదారుడు రవాణా ఖర్చులు మాత్రమే చెల్లించాలి -మైన్స్ శాఖలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చెయ్యడం జరుగుతోంది -తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు -మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆశయంతో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తున్న దృష్ట్యా వాటిని ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకుని వెళ్ళే …

Read More »

విద్యుత్ దీపాలతో శోభాయమానంగా ప్రకాశంబ్యారేజ్…కాంతులీనుతోన్న కృష్ణమ్మ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రకాశం బ్యారేజ్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆకర్ష ణీయంగా తీర్చిదిద్దారు. దీంతో విద్యుత్ దీపకాంతులతో ప్రకాశం బ్యారేజ్ శోభాయమానంగా కనువిందు చేస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మరో వైపు విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువప్రాంతాలనుండి వచ్చిచేరుతున్న వరదనీటితో నిండు కుండలా జలకళతో కృష్ణమ్మ కళకళలాడుతోంది. దీనికి తోడు బ్యారేజ్ పిల్లర్ లకు అమర్చిన రంగు రంగుల విద్యుత్ దీపాల కాంతలలో పరవళ్ళు త్రోక్కతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ సొగసులను వీక్షిస్తోన్న …

Read More »

విజయకీలాద్రి దివ్యక్షేత్రముపై సుదర్శన స్వామి తిరునక్షత్ర మహోత్సవం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామి వారి మంగళాశాసనములతో.. విజయకీలాద్రి దివ్యక్షేత్రముపై శ్రీమన్నారాయణుడి శ్రీహస్తం లో ఆభరణంగాను, శత్రువులకు ఆయుధంగాను దర్శనమిచ్చే సుదర్శన స్వామి తిరునక్షత్ర మహోత్సవం ఉ ॥ 9. గం॥ లకు పంచామృత అభిషేకము 10. గం॥ లకు సర్వరక్షాకర సుదర్శన హోమం , పూర్ణాహుతి, కుంభప్రోక్షణ, తీర్ధ ప్రసాద గోష్టి   తో కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది .

Read More »