గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డు 2024 అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

-గ్లోబల్ స్థాయి అవార్డు రావడం మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నకు గర్వకారణం –
-బుడితి రాజశేఖర్ ఐఏఎస్
ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (వ్యవసాయం & సహకారం)

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక పంచాయతీరాజ్ కమిషనర్ సమావేశ మందిరంలో శనివారం రెండవ రోజు ప్రకృతి వ్యవసాయం పై కార్యశాల కొనసాగింది. సాయంకాలం కార్యశాల ముగింపు కార్యక్రమములో గత జూలై నెలలో పోర్చుగల్ దేశపు ప్రకృతి వ్యవసాయం అత్యుత్తమ అవార్డు అయినటువంటి గుల్ బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024 అవార్డు ను ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్ఎఫ్)కు చెందిన మహిళా రైతుకు దక్కిన నెట్టెం నాగేంద్రమ్మ ను ఘనంగా సన్మానించారు. శ్రీ సత్యసాయి జిల్లా బాతులపల్లి మండలం , ఘంటాపురం గ్రామం నకు చెందిన నాగేంద్రమ్మ కు దక్కి న ఈ అవార్డు రాష్ట్రానికి గర్వ కారణం అని  రాజశేఖర్ ఐఏఎస్ తెలిపారు. తను పొందిన ప్రకృతిసాగు నైపుణ్యం ను ఇతర రైతులతో పంచుకుని ప్రకృతి వ్యవసాయ విస్తరణకు కృషి చేయాలని S.డిల్లీ రావు ఐఏఎస్ సంచాలకులు వ్యవసాయ శాఖ ఆంధ్ర ప్రదేశ్ వారు సన్మాన గ్రహీతను కోరారు. ప్రభుత్వ సలహాదారు & ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ T.విజయకుమార్ ఐఏఎస్ వారు సన్మాన గ్రహీత ను అభినందిస్తూ ,ఈ అవార్డు ను రైతులకు మెరుగైన జీవనోపాదులు కల్పించడంతో పాటు ,వాతావరణంలో మార్పులు తీసుకు రావడం ,సమాజానికి ఆరోగ్యకర పౌష్టికాహారాన్ని అందించడం మరియు భూమి ఆరోగ్యం మెరుగు పరచడం లో ఆమె చేసిన కృషికి ఈ అవార్డు రావడం జరిగిందని తెలిపారు. కార్యక్రమం ముందు జిల్లా అధికారులను ప్రాంతాల వారీగా 4 గ్రూప్ లుగా విభజించి ,ఆ గ్రూపులతో వారి ప్రాంతాలలో ప్రకృతి వ్యవసాయం పై చేపట్టబోవు అంశములపై బృంద చర్చలు జరిపి మేధో మథనం ద్వారా కార్యాచరణ ప్రణాళిక ను తయారుచేసి ,సభకు తెలియచేసారు. బి. రామారావు ఐఏఎస్, సీఈఓ,రైతు సాధికార సంస్థ వారు మాట్లాడుతూ కింది స్థాయి ప్రాథమిక క్షేత్ర సిబ్బంది అయిన గ్రామ సహాయకులకు వారిలో ప్రకృతి వ్యవసాయం విధానాలను ,నైపుణ్యం పెంపుదల పై ఆన్లైన్ ద్వారా విస్తృతమైన శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.ఈ అంశములో చురుగ్గా పాల్గొన్న వ్యవసాయ సిబ్బందికి రైతు సాధికార సంస్థ ఆగ్రో ఎకాలజి సెంటర్ అకాడమీ ద్వారా ప్రకృతి వ్యవసాయం పై పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తు న్నామన్నారు. డిడి శ్రీ బాలు నాయక్ వందన సమర్పణ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *