Breaking News

Daily Archives: August 15, 2024

ఐక్యంగా ముందుకు సాగుదాం… వికసిత భారత్‌ వైపు అడుగులు వేద్దాం…

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం వరుసగా ఇది 11వ సారి. 2014 ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆయన వరుసగా రెడ్‌ ఫోర్ట్‌పై మువ్వన్నెలను రెపరెపలాడిస్తోన్నారు. ఎర్రకోటకు చేరుకున్న వెంటనే త్రివిధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం త్రివర్ణ పతకాన్ని ఎగురువేశారు. ఆ సమయంలో హెలికాప్టర్లు ద్వారా పూల వర్షం కురిపించారు. జెండా ఆవిష్కరణ …

Read More »

అభివృద్ధి ఫలాలు అందరికీ అందించడమే మా లక్ష్యం… : సీఎం చంద్రబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందించడమే మా లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని లేని పరిస్థితి నుంచి 2014లో పాలన ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నామన్నారు. దేశంలో ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందామన్నారు. 2014-19 మధ్య కాలంలో టాప్‌-3 …

Read More »

కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : 78వ స్వాతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అధికారికంగా పాల్గొన్నారు. కాకినాడ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పవన్‌కల్యాణ్‌ మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది అమరుల త్యాగాల ద్వార వచ్చిన ఈ స్వాతంత్య్రం వేడుకల వేళ తాము ఆనందించాల్సిన దానికంటే.. దేశ బాధ్యతను గుర్తు చేసుకునే రోజు అని.. ఇలాంటి బాధ్యతే తనను ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిందని …

Read More »

తాడేపల్లిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్‌

తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ’’ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే …

Read More »

గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేసి తొలిసారి గోల్కొండ కోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో …

Read More »

త్రివర్ణ అలంకరణలో కాశీ విశ్వేశ్వరుడు

జనరల్‌ డెస్క్‌, నేటి పత్రిక ప్రజావార్త : దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. వారణాసిలో కొలువైన విశ్వేశ్వరుడు కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగితేలాడు. శ్రావణమాస శోభతో వెలిగిపోతున్న కాశీ విశ్వేశ్వరుని ముంగిట నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వామివారి దర్బారును అందంగా అలంకరించారు. ఇందుకోసం జాతీయ పతాకంలో కనిపించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చల రంగులు కలిగిన పూలను వినియోగించారు. ఆలయానికి వచ్చిన భక్తులు హరహర మహాదేవ్‌తో పాటు జై భారత్‌ మాతాకీ అంటూ …

Read More »

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న చంద్రగిరి ఎంఎల్ఏ

-పులివర్తి నాని చేతుల మీదుగా జాతీయ పతాకం ఆవిష్కరణ చేసి గౌరవ వందనం చేశారు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి తాసిల్దార్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొని ఆయన చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ చేసి జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకున్నారు. గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి తాసిల్దార్, సబ్ రిజిస్టార్, పోలీసులు, విద్యుత్, వైద్య ఇతర …

Read More »

ఈ నెల 17న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రేణిగుంట విమానాశ్రయం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎలాంటి అలసత్వం ఉండరాదు

–జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 17వ తేదీన స్వర్ణ భారత ట్రస్ట్ 23 వ వార్షికోత్సవానికి భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సతీ సమేతంగా హాజరు కానున్నారని, ఆ సందర్భంగా వారు రేణిగుంట విమానాశ్రయానికి 17వ తేదీ ఉదయం 9.40 గం. లకు చేరుకోని నెల్లూరు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లి తిరిగి సాయంత్రం 3.35 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, భద్రత తదితర …

Read More »

కనుల పండుగగా దేశ భక్తి ఉట్టిపడేలా 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

-ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఎగరేసిన గౌ. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి -డి ఆర్ డి ఎ ద్వారా 4869 మంది స్వయం సహాయక సంఘాలలోని 35,244 మంది సభ్యులకు, బ్యాంక్ లింకేజి, స్త్రీ నిధి ఉన్నతి, సి.ఐ.ఎఫ్ పథకాల లబ్ధి దారులకు రూ.250 కోట్ల రుణాల మెగా చెక్కును పంపిణీ చేసిన మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి -మెప్మాా లోని 6920 స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు బ్యాంక్ లింకేజ్ ద్వారా 96 కోట్ల …

Read More »

స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలి…

-సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం -జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో రైతులు, కార్మికులు, విద్యార్థులు అశేష జనం పాల్గొని బ్రిటీష్‌ వారిని తరిమికొట్టారని చెప్పారు. అల్లూరి …

Read More »