విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లోతట్టు ప్రాంతాల్లో ఇంకా ఎక్కడైనా నీరు ఉంటే త్వరితగతిన బయటకు పంపేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, బుడమేరు ఉద్ధృతి కారణంగా విజయవాడ రూరల్ అంబాపురం ప్రాంతంలో ఇంకనూ ఉన్న నీటిని త్వరితగతిన బయటకు పంపేలా చర్యలు తీసుకోవాల న్నారు. బుధవారం పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ కె.కన్నబాబు, జిల్లా కలెక్టర్ డా. జి.సృజనతో కలసి అంబాపురంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పల్లపు ప్రాంతాలలో ఇంకనూ …
Read More »Daily Archives: September 11, 2024
ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన, దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపార సముదాయాలు వంటి ఆస్తులకు సంబంధించిన బీమా క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని.. దీన్ని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సూచించారు. ఈ నెల 9వ తేదీన విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ …
Read More »కష్టమొచ్చిన ప్రతిఒక్కరి నష్టాన్నీ గణిస్తాం
– ఎవరైనా మిగిలి ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – ఈనెల 12న సచివాలయంలో సంప్రదిస్తే ఎన్యూమరేషన్ బృందాన్ని పంపి వారి నష్టాన్నీ నమోదుచేస్తాం – ప్రజలను బాధనుంచి గట్టెక్కించేందుకు అన్ని విధాలా సహాయసహకారాలు – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, పరిసర వరద ప్రభావిత ప్రాంతాల్లో గృహాలకు, వ్యాపార వాణిజ్య ఆస్తులకు జరిగిన నష్టాన్ని యాప్‌లో నమోదుచేసే ప్రక్రియ అర్బన్ ఏరియాలో దాదాపు పూర్తికావొచ్చిందని, గ్రామీణ ప్రాంతంలోనూ శరవేగంగా జరుగుతోందని.. అయితే ఇంకా …
Read More »భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రంలో 2 రోజుల పాటు కేంద్ర బృందం పర్యటన
-తొలిరోజు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో భేటీ -వివిధ శాఖల్లో జరిగిన నష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర అధికారులు -ప్రాథమిక అంచనాగా రూ. 6,880 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి వెల్లడించిన రాష్ట్ర ఉన్నతాధికారులు -రాష్ట్ర అధికారుల నుండి సమగ్ర నివేదికను తీసుకున్న అనంతరం 2 బృందాలుగా విడిపోయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సెంట్రల్ టీం -గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఒక టీం, కృష్ణా జిల్లాలో పర్యటించిన మరో టీం విజయవాడ, నేటి …
Read More »ఆధ్యాత్మిక భావనతో మానసిక ప్రశాంతత…
-మహా గణపతికి మంత్రి సవిత ప్రత్యేక పూజలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మిక భావనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. విజయవాడ సితార సెంటర్ లో డూండీ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల మహా విజయ గణపతిని మంత్రి సవిత బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలరాముడు, వారాహి మాత విగ్రహా పత్రిష్టాపన కార్యక్రమంలోనూ పాల్గొని పూజలు నిర్వహించారు. …
Read More »హైడ్రా కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు నష్టపరిహారం చెల్లించాలి…
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైడ్రా కూల్చి వేతల్లో ఇళ్లు కొల్పోయిన పేదలకు ప్రభుత్వం పునర వాసం కల్పించి, నష్టపరిహారం చెల్లించాలని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాతో నగరంలో చెరువులు, నలాలను కబ్జా చేసిన అక్రమార్కుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయని చెప్పారు. హైడ్రాను తమ పార్టీ స్వాగతిస్తూ సంపూర్ణ మద్దతు …
Read More »సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ను పునః సమీక్ష చేయాలి…
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ. క్రిమిలేయర్ సుప్రీం కోర్ట్ తీర్పు ను రద్దు చేయాలని, మోడీ, రేవంత్ రెడ్డి సర్కార్ లను డిమాండ్ చేస్తూ.. నేడు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన పెద్ద ఎత్తున ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్బంగా దళిత బహుజన పార్టీ DBP ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక సమితి. మాలమహానాడు కార్యకర్తలు పెద్ద ఎత్తున వర్గీకరణ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షులు, సమితి జాతీయ …
Read More »అనుమతి లేని బోర్డ్ లను తొలగిస్తాం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ అనుమతితో నగరంలో ఏర్పాటు చేసిన ప్రతి ప్రకటన బోర్డ్ నిర్దేశిత మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజులు చెల్లించాలని, ఫీజులు చెల్లించని, అలాగే అనుమతి లేని బోర్డ్ లను తొలగిస్తామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం పట్టణ ప్రణాళిక అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఫీజులు చెల్లించని, అనధికార హోర్డింగ్లు, బోర్డ్ లను, ఫ్లెక్సీలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »పెనమలూరు మండలంలో కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం బుధవారం కృష్ణాజిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టం పరిశీలించింది. తొలుత పెనమలూరు మండలంలోని ఎనమలకుదురు నుండి బయలుదేరి పెదపులిపాక వస్తు దారిలో దెబ్బతిన్న వరి పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. పెదపులిపాకలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను, వరదలకు నీట మునిగిన ఇళ్ళు, సమగ్ర రక్షిత మంచినీటి పథకం ట్రాన్స్ఫార్మర్ పరిశీలించారు. చోడవరంలో బొప్పాయి అరటి …
Read More »డ్రైన్ల ఆక్రమణలను యుద్ద ప్రాదిపదికన తొలగింపు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త విజయవాడలో వరద ప్రభావానికి ప్రధాన కారణమైన డ్రైన్ల ఆక్రమణలను యుద్ద ప్రాదిపదికన తొలగిస్తున్నామని, కల్వర్ట్ ల ను జెట్టింగ్ యంత్రాల ద్వారా, యంత్రాలు వెళ్లడానికి వీలు లేని చిన్న వీధుల్లో గల్ఫర్ యంత్రాలతో మెగా పారిశుధ్య పనులు చేపడుతున్నామని 62వ డివిజన్ పర్యవేక్షణ అధికారి, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. బుధవారం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ ఐఏఎస్ తో కలిసి 62వ డివిజన్ లోని ప్రధాన రహదారుల వెంబడి డ్రైన్ల …
Read More »